ఇళ్ళ నిర్మాణంపై బాబు, అచ్చెన్నవి సొల్లు మాటలు

రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

 టిడ్కో ఇళ్ళ నిర్మాణంలో ఎవరి హయాంలో ఏం జరిగిందో క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి మేం సిద్ధం

 ప్రజలను రెచ్చగొట్టేందుకు గోతికాడ నక్కల్లా టీడీపీ, ఎల్లో మీడియా కాచుకు కూర్చుంది

 బాబు అధికారంలో ఉండగా ఏ ఒక్క మేలు చేయలేదు.. మేము చేస్తుంటే బండలేస్తారా..?

  మీ హయాంలో టిడ్కో ఇల్లు ఒక్కటంటే ఒక్కటి అయినా లబ్ధిదారులకు ఇచ్చారా... ?

 పేదవాడికి మేలు చేసే విషయంలో రాజకీయాలు చేయొద్దు

 టిడ్కో ఇళ్ళు పూర్తి చేసి, ఆరోజు నుంచే నివాసం ఉండేలా మేం తాళం ఇస్తున్నాం

విజ‌య‌న‌గ‌రం: ఇళ్ల నిర్మాణంపై ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు, అచ్చెన్నాయుడివి సొల్లు మాట‌ల‌ని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొట్టిపారేశారు.  టీడీపీకి, చంద్రబాబుకు వత్తాసు పలికే మీడియాలో అసత్యాలు, అబద్ధాలతో కూడిన ఏవో కథనాలు రాయడం, దానిపై రాజకీయ లబ్ది కోసం ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ, ప్రజలలో లేని అసంతృప్తిని రేకెత్తించి రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటి దిగజారుడు రాజకీయాలు మానుకుంటే మంచిదని చెప్పదలచుకున్నాను. గత రెండున్నరేళ్లుగా ఇది జరుగుతూనే వస్తోంది. ఈ మధ్య కాలంలో వీరి అబద్ధాలు, అసత్యాల ప్రచారం శృతి మించిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శ‌నివారం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. 

విద్యుత్‌ కోతలు ఎక్కడ ఉన్నాయో చూపించండి
    - విద్యుత్‌ కోతలు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్టీపీసీకి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సంబంధించి పేమెంట్లు చెల్లింపులో కొంత కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వచ్చిన ఫలితంగానే రెండు, మూడు రోజులు చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడ్డాయి.  వాటిని మేము కూడా అంగీకరిస్తున్నాం. ఆ సమస్య సద్దుమణిగిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్‌ కోతలు లేవు. కానీ కోతలు అంటూ అసత్యాలను ప్రచారం చేస్తూ, లేని సమస్యను భూతద్దంలో చూపించి ప్రచారం చేస్తున్నారు.  ఎక్కడైనా, ఎప్పుడైనా చిన్న చిన్న సాంకేతికమైన సమస్యలు వస్తుంటాయి, దాని పరిష్కార మార్గాల కోసం ప్రభుత్వం చేయాల్సింది చేస్తోంది. దీనిపై రెండ్రోజుల నుంచి చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు, ఏబీఎన్‌, ఈటీవీ, టీవీ5 ఛానల్స్‌ ఇష్టమొచ్చినట్లు విమర్శలు, వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాయి. విద్యుత్‌ కోతలు ఎక్కడ ఉన్నాయో చూపించండి.. గ్రామాల్లోకి వెళదాం రండి.

వివేకానందరెడ్డి హత్యపైనా చిలువలు, పలువలు
    - ఇక వైఎస్‌ వివేకానందరెడ్డి గారి హత్య గురించి కూడా చిలువలు పలువలు చేస్తున్నారు. ఆయన మాపార్టీ నేత, ముఖ్యమంత్రిగారి చిన్నాన. ఆ ఘటనపై అందరం బాధపడ్డాం. జరిగిన సంఘటనపై విచారణ అడిగాం. దానిపై విచారణ కొనసాగుతోంది. ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెబుతున్నారు. దీనిపై టీడీపీ అనుకూల మీడియా లేనిపోని కథనాలు సృష్టించి, చిలువలు, పలువలుగా అబద్ధాలను వండివార్చుతున్నారు. వీరు చేస్తున్న ప్రచారం వల్ల... కేసు విచారణను ప్రభావితం చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు వాటి పని అవి చేసుకుంటూ వెళుతున్నాయి. అయితే ప్రజల్లో అపోహలు సృష్టించి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాన్ని టీడీపీ చేస్తోంది.

- మరికొన్ని అంశాలను కూడా  సీబీఐ పరిగణలోకి తీసుకుని విచారించాలని మా పార్టీ తరఫున మా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తప్పేంటి, అవినాష్ రెడ్డి మీద టీడీపీ ఎలా ఏకపక్షంగా ఆరోపణలు చేస్తుంది. 

చెత్త తొలగింపునకు నెలకు 30 వసూలు చేస్తే, దానిపైనా రాద్ధాంతమేనా..?
    - ఇంకోవైపు చెత్త మీద పన్ను అంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ అంశాన్ని ఏరోజు అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టామో, క్లాప్‌ (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) కార్యక్రమం అమలు కోసం కార్యాచరణ రూపొందించి, విధివిధానాలు ఖరారు చేశాం. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని అమలుచేసి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా, నామమాత్రంగా నెలకి రూ.30, రూ.60 వసూలు చేస్తున్నాం. అదేదో ప్రజలను దోపిడీ చేస్తున్నట్లు, వారిని దోచేసుకుంటున్నట్లు కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి. దీని మీద ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నాయి. అసలు వీరి ఉద్దేశం, వీరి ఆలోచనా విధానం ఏంటి? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క మంచి పని చేయరు. వారు అధికారంలో ఉన్నంతకాలం ప్రజా హిత కార్యక్రమాలు చేయలేదు. మేము చేస్తుంటే వీళ్ళకి కడుపుమంట. మరోవైపు టీడీపీకి వత్తాసు పలుకుతూ ఎల్లో మీడియాలో అవే కథనాలు రాస్తూ, ప్రజలను గందరగోళపరచాలన్నది వీరి  ఉద్దేశం. 

- ఊరు బాగుపడకూడదా.. ప్రజలు కంపు కొట్టుకుంటూ ఉండాలా.. అసౌకర్యాన్ని ప్రజలు భరించగలరా..? వారికి ఆ స్థోమత ఉందా, లేదా అని అన్నీ ఆలోచించే క్లాప్ కార్యక్రమం అమలు చేస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. కాఫీనో, టీ నో తాగినంత మేరకే నెలకు వసూలు చేస్తున్నాం తప్పితే, అదేదో పెద్ద ఖర్చు కాదు. 

ఇళ్ళ నిర్మాణంపై బాబు, అచ్చెన్నవి సొల్లు మాటలు
- ఇళ్ల నిర్మాణానికి సంబంధించి టీడీపీ నిన్న ఓ ఫోటో  ఎగ్జిబిషన్‌ పెట్టడం,  తమ హయాంలో టిడ్కో ఇళ్ళను అద్భుతంగా నిర్మించినట్టు చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆ ఫోటోలను చూస్తున్నట్లు ఫోజులివ్వడం... దానిమీద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రెస్‌మీట్‌ పెట్టి వాళ్ల హయాంలో ఏదో ఉద్దరించినట్లు ... మేము అధికారంలోకి వచ్చాక ఏమీ చేయనట్లు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

-  చంద్రబాబు హయాంలో ఇల్లు మంజూరు కావాలంటే.. జన్మభూమి కమిటీలకో, ఆ పార్టీ నేతలకో కమీషన్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. జన్మభూమి కమిటీలను పెట్టి సామాన్య ప్రజలను దోచుకుతిన్నారు. మేము అధికారంలోకి వచ్చాక.. ఈ పరిస్థితిని మార్చి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. భూమిలేని పేదలకి స్థలాలు ఇచ్చి, జగనన్న కాలనీల పేరుతో పెద్దఎత్తున ఇళ్ళ నిర్మాణం చేపట్టాం. 

- టిడ్కో ఇళ్లకు సంబంధించి,  చదరపు అడుగుకి, సాధారణంగా వెయ్యి, పన్నెండు వందలు అయ్యేదాన్ని రూ.1800 రేటుపెట్టి టీడీపీ హయాంలో దోచుకుతిన్నారు. 300 చ.అడుగులు ఇళ్ళు కేటాయించిన పేదవాడు ప్రతినెలా తమ జేబులో నుంచి రూ.2వేలు ఇంటి అద్దె కట్టాలంటే ఇబ్బంది కాబట్టి, తాము అధికారంలోకి వస్తే ఉచితంగా ఇస్తామని జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఎన్నికల ముందే చెప్పారు. చెప్పిన మాట ప్రకారం... ఇచ్చిన హామీని అమలు చేస్తున్నాం. ఇది వాస్తవం కాదా? ఆ ఇంటికి చెల్లించాల్సిన మొత్తం నాలుగు లక్షల అరవై అయిదు రూపాయిలను, కేంద్రం కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత భరిస్తూ పేదవాళ్ళకు ఉచితంగా ఇస్తున్నామా.. లేదా? దాంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. దీనిమీద అచ్చెన్నాయుడు అయినా సరే, మరెవరైనా సరే... ఎవరు చర్చకు వచ్చినా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకింత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని అడుగుతున్నాం. వాస్తవాలను వక్రీకరించి మాట్లాడటం సరికాదు.

-  టీడీపీ అధికారంలోకి వస్తే  టిడ్కో ఇళ్ళకు సంబంధించి 3లక్షల 30 వేలు కట్టిస్తామని చెబుతున్నారు, అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు అని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మేం కట్టిస్తున్న ఇళ్లను పిచ్చుకల గూళ్లు అంటున్న చంద్రబాబు, తమ హయాంలో ఎన్ని అడుగుల్లో నిర్మించారు...? మేము చెప్పే ప్రతి మాటకు రికార్డు ఉంది. అది అసెంబ్లీలో అయినా, అంతకు ముందు పత్రికా సమావేశాల్లో ఏం చెప్పామో, ఇవాళ కూడా అదే చెబుతున్నాను. నేను చెప్పే ప్రతి మాట ప్రభుత్వం తరపున చెప్పే మాట. చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడులాగా సొల్లు మాటలు చెప్పడం లేదు.

- స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారి హయాంలో నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి పెద్ద ఎత్తున ఇళ్ళ నిర్మాణం చేశాం.  వైఎస్ గారి హయాంలో రూరల్‌ హౌసింగ్‌లో 215 చ.అడుగులు ఇచ్చాం. దానికి రూ.25వేలు డివిడెంట్‌ కాస్ట్‌. అదే అర్బన్‌లో డివిడెంట్‌ కాస్ట్‌ రూ.40వేలు.

- ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హయాంలో ఎన్టీఆర్ హౌసింగ్ పేరుతో.. 275 ఎస్ఎఫ్టీ ఇళ్ళను రూ.2లక్షల ఖర్చుతో నిర్మించారు. 

- ఇప్పుడు మేం అధికారంలోకి వచ్చాక, జగనన్న కాలనీల పేరుతో 340 ఎస్ఎఫ్టీ ఇళ్ళను రూ. 2.60 లక్షలతో నిర్మిస్తున్నాం. అంటే ఎవరు ఎక్కువ ఇచ్చారు, ఎవరు తక్కువ ఇచ్చారు. దీన్ని సెంటు పట్టాలని హేళన చేస్తారా?

- కాలానుగుణంగా,  ప్రజల అవసరాలను గుర్తించి, ప్రభుత్వాలు వెలుతుంటాయి. ఆ పని మేం చేస్తుంటే, ఎందుకు అవాస్తవాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. 

కట్టని టిడ్కో ఇళ్ళను కట్టినట్లు ప్రచారమా..?
    - టిడ్కో ఇళ్ళు ఒక్కటంటే ఒక్కటి అయినా లబ్ధిదారులకు మీరు ఇచ్చారా... ? అని ప్రశ్నిస్తున్నాం.  అమెరికా, లండన్, జపాన్ , టోక్యో నుంచి టెక్నాలజీ తీసుకొచ్చి షేర్ వాల్ టెక్నాలజీతో టిడ్కో ఇళ్ళు నిర్మించామని నిన్న కూడా చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఆ టెక్నాలజీ పేరుతో మీరు దోచుకుతిన్నది నిజం కాదా..?

- కట్టని ఇళ్ళను కట్టినట్లు ప్రచారమా..? 3.15 లక్షల టిడ్కో ఇళ్ళు మీరు కట్టారా..? చెప్పండి. గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలిద్దాం, రండి. 
- టిడ్కో ఇళ్ళ నిర్మాణంపై పదే పదే అటు అసెంబ్లీలోనూ, ఇటు బయట కూడా చెప్పాను. 
- టీడీపీ హయాంలో కేంద్రం 7 లక్షల ఇళ్ళు మంజూరు చేస్తే.. వాటిలో 5 లక్షల ఇళ్ళు మంజూరు చేయించుకున్నారు.  అందులో 3.13 లక్షలు గ్రౌండింగ్ చేయాలని ప్రయత్నం చేశారు. 2. 62 లక్షల ఇళ్ళు పునాదులు వేసి వదిలేశారు. ఇప్పుడు మేము వాటిని కంప్లీట్ చేస్తున్నాం.  

- వాస్తవాలను పక్కనపెట్టి, మీరు కట్టని టిడ్కో ఇళ్ళు గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయన్నట్టు ఆ మాటలేమిటి..? మీరు సిద్ధం చేస్తే, మేము చేస్తున్నదేమిటి..?
- టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్ళ నిర్మాణం ఎలా ఉందంటే...
- 80 శాతం పనులు దాటినవి 80 వేలు
- 50 శాతం దాటినవి 70 వేలు
- 25 శాతం వరకు పనులు జరిగినవి 50 వేలు
బేస్ మెంట్ లో ఉన్నవి మరో 63 వేలు.. వీటన్నింటికి సంబంధించి జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చాక, రివర్స్ టెండరింగ్ కు వెళ్ళి దాదాపు రూ. 400 కోట్లు మిగిల్చాము. 

- మరోవైపు 80 శాతం పూర్తైన ఇళ్ళకు సంబంధించి కూడా,  రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, తాగు నీరు.. ఇలా ఏ ఒక్క సదుపాయమూ లేదు. అట్లాండిది, మీరేదో కట్టామని ప్రచారం చేసుకుంటారా, ఎగ్జిబిషన్ లు పెడతారా.. రండి వాస్తవాలేమిటో చూద్దాం. టీడీపీ విమర్శలను పూర్తిగా ఖండిస్తున్నాం.

*మేము సిద్ధం.. మీరు సిద్ధమా..?
- టిడ్కో ఇళ్ళ నిర్మాణం పేరుతో మీ హయాంలో ఏం జరిగిందో.. మా హయాంలో ఏం పనులు జరిగాయో...  ప్రభుత్వం తరఫున మేము తయారుగా ఉన్నాం. మీలా, రాజకీయ లబ్ధి కోసం మేము మాట్లాడటం లేదు. ఈ ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉంది. పేదలకు ఇళ్ళు ఇచ్చే విషయంలో ఎక్కడా రాజీపడొద్దని ముఖ్యమంత్రి జగన్ గారు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా, వాటిని అధిగమించి పేదవాళ్ళ ఇళ్ళను పూర్తి చేస్తున్నాం. 

- మేం తాళం ఇస్తే.. లబ్ధిదారులు ఆరోజే ఇళ్ళల్లో ఉండే విధంగా మేము పూర్తి చేసి ఇస్తున్నాం. ఇంట్లో చేరాక, వారికి ఏ ఇబ్బందుల్లేకుండా నివాసయోగ్యంగా తయారు చేసి ఇస్తున్నాం. 
- ప్రస్తుతం మొత్తం 2.62 లక్షల టిడ్కో ఇళ్ళల్లో 2.05 లక్షల ఇళ్ళు 75 శాతం రెడీగా ఉన్నాయి. 15 రోజుల్లో వాటికి రోడ్లు కూడా పూర్తి చేస్తున్నాం.  ఇప్పటికే నెల్లూరులో  లబ్ధిదారులకు ఇళ్ళు కేటాయించాం. పది రోజుల్లో తూ. గో. జిల్లాలో రాజమండ్రి, పెద్దాపురంలో కూడా ఇళ్ళు లబ్ధిదారులకు ఇస్తున్నాం. ప. గో. జిల్లా భీమవరం, పాలకొల్లులోనూ ఇళ్ళు ఇవ్వబోతున్నాం. నేనే ప్రత్యక్షంగా చూసి, ఇళ్ళు  పూర్తయ్యాక, లబ్ధిదారులకు అప్పగిస్తున్నాం. ఇది వాస్తవం. 

- 365, 430 చ. అడుగులకు సంబంధించిన ఇళ్ళకు లబ్ధిదారులు చెల్లించే మొత్తంలో ప్రభుత్వమే సగం భరిస్తుంది. 300 ఎస్ఎఫ్టీ ఇళ్ళకు సంబంధించి, పూర్తిగా జీరో కాస్ట్.. అంటే ఉచితంగా లబ్ధిదారులకు ఇస్తున్నాం.  రూ.1తో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. 300 ఎస్ ఎఫ్టీకి సంబంధించి బ్యాంకు రుణాన్ని పూర్తిగా ప్రభుత్వమే కడుతుంది. 

-  పేదల పట్ల, పేదల సంక్షేమం పట్ల, వారికి కావాల్సిన అవసరాల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. టీడీపీ హయాంలో మాదిరిగా మొక్కుబడిగా కాకుండా, ప్రతిదీ శాశ్వతమైన, దీర్ఘకాలికమైన ఆలోచన విధానంతో చేస్తున్నాం.

- మరోవైపు టిడ్కో ఇళ్ళకు సంబంధించి రూ.50 వేలు, లక్ష కట్టి, తమ డబ్బులు వాపసు కావాలని అడిగిన లబ్ధిదారులకు డబ్బులు వెనక్కి ఇచ్చి, వారిలో అర్హులైన వారికి జగనన్న కాలనీల్లో ఉచితంగా ఇళ్ళు కట్టిస్తున్నాం. వారికి  ఆ డబ్బు మూడు వారాల్లో జమ అయ్యేవిధంగా అడ్వాన్స్ చెక్కులు  కూడా ఇస్తున్నాం. ఇది ప్రజల కోసం పనిచేస్తున్న గవర్నమెంటు. మీ మాదిరిగా చేతులు దులుపుకు వెళ్ళే ప్రభుత్వం కాదు. 

- నేను చెప్పేదానిలో ఇప్పటికీ, మీకు అనుమానాలు ఉంటే.. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే.. నాకు నేరుగా ఫోన్ చేయండి, నేను క్లారిఫై ఇస్తాను.... అని టీడీపీ నేతలకు చెప్పదలచుకున్నాను. 

- పేదవాడికి మేలు చేసే విషయంలో రాజకీయాలొద్దు. ఇందులో లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను గందరగోళం చేయవద్దు అని మనవి చేస్తున్నాం. టీడీపీ,  ప్రతిపక్షాల విమర్శలు, ఎల్లో మీడియా రాతలతో ప్రజలు గందరగోళానికి గురి కావొద్దు. ఈ ప్రభుత్వం కమిట్ మెంటుతో పనిచేస్తుంటే.. మాపై విమర్శలు చేయడం సరికాదు. ప్రజల్లో గందరగోళం సృష్టించి రాజకీయ లబ్ధి పొందటం కరెక్టు కాదు. 

- చంద్రబాబు ఒక మాట మాట్లాడితే.. మేమూ పది మాటలు మాట్లాడతాం.. మేము బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉన్నాం. తప్పుడు  మాటలు మాట్లాడి, నాలుక కరుచుకునే వ్యక్తులం కాదు. 

- మొన్నటి వరకు ఉద్యోగల సమ్మెలో రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. అది కుదరలేదు. దాంతో మరో అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఉద్యోగులకు ఈ ప్రభుత్వం ఎందుకు అన్యాయం చేస్తుంది. వారు ఈ ప్రభుత్వంలో కుటుంబ సభ్యులు. ఎప్పుడు ఏం దొరుకుతుందా అని.. గోతికాడ నక్కలా టీడీపీ కాచుకు కూర్చుంది. వారి కలలు నెరవేరవు. 

- జగన్ మోహన్ రెడ్డిగారు  ప్రజలకోసం ఏది చేసినా.. దీర్ఘ కాలిక ప్రయోజనాల కోసం చేస్తారు.  రాత్రికి రాత్రి తీసుకునే విధానం జగన్ గారిది కాదు. మంచి మనసుతో ఆయన ఏదైనా చేస్తారు. దానికి భగవంతుడు ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం, వారిని నమ్ముకున్న కొన్ని టీవీ ఛానళ్ళు, వారి మీడియా భ్రమలు, భ్రమలుగానే ఉండిపోతాయి. 

ప్రత్యేక హోదా రాష్ట్రానికి అత్యవసరం
- ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి అత్యవసరం అని పదే పదే చెబుతున్నాం. దానికోసమే పోరాడుతున్నాం. చంద్రబాబు లా మేం లాలూచీ పడం, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టం. కేంద్రంలో మన అవసరం లేని ప్రభుత్వాన్ని భగవంతుడు తీసుకు రావటం వల్లే ఈ  పరిస్థితి. అయినా, ప్రత్యేక హోదాను సజీవంగా ఉంచి, పోరాడి, సాధించుకుని తీరతాం. 

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ...
- జిల్లాలో నేను గానీ, నా కుటుంబ సభ్యులు గానీ మరొకరి భూముల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు.  అశోక్ గజపతిరాజు కుటుంబీకుల నుంచి మా తండ్రి గారు ఉన్నప్పుడు 75 ఎకరాలు భూమి కొనుగోలు చేశారు. అది మాది అని అందరికీ తెలుసు. ఒకవేళ అది మాది కాకపోతే, అశోక్ గజపతిరాజుది అవుతుంది. మరి, అందులో మూడో వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడు..? ఇది సింపుల్ లాజిక్. వాళ్ళ దగ్గర కాగితాలు ఉంటే, ఆర్డీవో కి ఇస్తే, వాస్తవాలు తెలుస్తాయి. మాకు ఎవరిదీ అక్కర్లేదు. మాది మాకుంటే చాలు. 

మూడు రాజధానులే మా విధానం
- మూడు రాజధానులే ప్రభుత్వ విధానం. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనుకున్నాం. ఆ దిశగానే ప్రభుత్వ విధానాలు ఉంటాయి. 
- ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... ఒకేసారి 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఏమైనా ఉందా.. ? అవి ఉద్యోగాలు కాదా.. వారు నిరుద్యోగులు కాదా.. ? అది డైరెక్టర్ రిక్రూట్ మెంటేగా..  ఇప్పటివరకు నేను 6 ప్రభుత్వాలు చూశాను, ఎవరూ ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏపీపీఎస్సీ ద్వారా కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. 
- వ్యక్తుల కోసం విధానాలు రావు. వ్యక్తులు విధానంలో ఉండాలి. 

Back to Top