‘ఎయిడెడ్‌’పై ఎలాంటి బలవంతం లేదు

రాజకీయ ప్రయోజనాల కోసం ఎయిడెడ్‌ స్కూళ్ల‌పై టీడీపీ దుష్ప్రచారం

శాసనమండలిలో మంత్రి బొత్స సత్యనారాయణ

శాసనమండలి: ఎయిడెడ్‌ స్కూళ్లను, కాలేజీలను ప్రభుత్వానికి అప్పగించడంలో ఎలాంటి బలవంతం లేదని పదే పదే చెబుతున్నామని, స్కూళ్ల యాజమాన్యాలకు ప్రభుత్వం నాలుగు ఆప్షన్లు ఇచ్చిందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఎయిడెడ్‌ స్కూళ్లపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎయిడెడ్‌ స్కూళ్ల వ్యవహరంపై శాసనమండలిలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఎయిడెడ్‌ స్కూళ్ల వ్యవస్థను చంద్రబాబు భ్రష్టుపట్టించారని అన్నారు. గత ప్రభుత్వంలో ఎయిడెడ్‌ స్కూళ్లు, కాలేజీలలో ఉపాధ్యాయులు, అధ్యాపకులను నియమించలేదని చెప్పారు. విద్యా వ్యవస్థలో సీఎం వైయస్‌ జగన్‌ అనేక మార్పులు తీసుకువచ్చారని, నూతన విద్యా విధానం తీసుకొచ్చి ఏపీని దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉంచాలన్నదే సీఎం ఆలోచన అని మంత్రి బొత్స వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల వినతి మేరకే ఎయిడెడ్‌ స్కూళ్ల వ్యవహారంలో జీఓలు జారీ చేస్తున్నామని చెప్పారు. 
 

తాజా వీడియోలు

Back to Top