వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి జిందాల్‌ ప్లాంట్‌

ప్లాంట్‌ పనులను పరిశీలించిన మంత్రి బొత్స సత్యనారాయణ

గుంటూరు: వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్న జిందాల్‌ ప్లాంట్‌ను మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. జిందాల్‌ ప్లాంట్‌ పనులు 2016లో ప్రారంభమయ్యాయని, గత ప్రభుత్వం కేవలం 10 శాతం పనులే చేసిందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చాక జిందాల్‌ ప్లాంట్‌ పనులు వేగవంతం చేశామన్నారు. వచ్చే నెలలో ప్లాంట్‌ను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. గుంటూరు, విజయవాడ, తాడేపల్లి–మంగళగిరి కార్పొరేషన్‌ సహా మరో 6 మున్సిపాలిటీల నుంచి వచ్చే చెత్తను ఉపయోగించి విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నామన్నారు. విశాఖలోనూ ఈ తరహా ప్లాంట్‌ నిర్మాణంలో ఉందన్నారు. ఈ ప్లాంట్‌ ద్వారా 15 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. 
 

తాజా వీడియోలు

Back to Top