ఏ ప్రాంతంలో ఏ పంట పండుతుందో చెప్ప‌గ‌ల‌వా..?

లోకేష్‌కు మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్‌

ట్రాక్టర్‌ను బురద గుంటలోకి పోనివ్వడం తప్ప లోకేష్‌కు ఏం తెలుసు

శాసనమండలి: ఏ ప్రాంతంలో ఏం పంట పండుతుందో తెలియని లోకేష్‌.. పంట నష్టం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. లోకేష్‌ ఎక్కడ ఏం పంట పండుతుందో చెబితే నేను తలదించుకొని కూర్చుంటా అని సవాల్‌ విసిరారు. నివర్‌ తుపాన్‌ ప్రభావంతో జరిగిన పంట నష్టంపై శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ట్రాక్టర్‌ ఎక్కి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కాదు.. రాష్ట్ర రైతాంగం, వ్యవసాయ రంగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రైతు ట్రాక్టర్‌ను బురద గుంటలోకి పోనివ్వడం తప్ప లోకేష్‌కు ఏం తెలుసు అని ప్రశ్నించారు. చంద్రబాబు మనసులో మాట పుస్తకంలో వ్యవసాయం దండగ అని రాశారని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top