పైడితల్లి అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహిస్తాం

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విజయనగరం: పైడితల్లి అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహిస్తామని రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంపై జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర సంబంధించిన ఏర్పాట్లు, కోవిడ్‌ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌ నేపథ్యంలో భక్తులు తక్కువ వచ్చేలా అవగాహన కల్పిస్తామన్నారు. జాతర సమయంలో ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తామన్నారు. సిరిమాను తిరిగే ప్రతి వీధిలో స్క్రీన్స్‌ ద్వారా భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు. సిరిమాను జాతర రోజున అన్ని దుకాణాలు మూసివేయాలని అధికారులను ఆదేశించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top