బాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగ‌మిస్తాం

ప్ర‌జా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే సీఎం ధ్యేయం

మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

తాడేప‌ల్లి: చ‌ంద్ర‌బాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగ‌మిస్తామ‌ని, ప్ర‌జా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ధ్యేయ‌మ‌ని రాష్ట్ర మున్సిప‌ల్‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. అమ‌రావ‌తి మెట్రోపాలిట‌న్ రీజియ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీపై సీఎం స‌మీక్ష అనంత‌రం మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. అమ‌రావ‌తిలో నిర్మాణాలు పూర్తిచేసే కార్యాచ‌ర‌ణ‌పై అధికారుల‌తో సీఎం చ‌ర్చించార‌న్నారు. నిధుల స‌మీక‌ర‌ణ‌కు ప్ర‌ణాళిక సిద్ధం చేయాల‌ని సీఎం చెప్పారన్నారు.

అమ‌రావ‌తి కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అంత‌ర్భాగ‌మేన‌ని చంద్ర‌బాబుకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ల‌క్ష్య‌మ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ప్ర‌తిప‌క్షం అంటే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకురావాల‌ని, కానీ తెలుగుదేశం పార్టీ అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. చంద్ర‌బాబుకు త‌న ప్ర‌యోజ‌నాలే ముఖ్యమ‌న్నారు. చంద్ర‌బాబు ఎన్ని కుట్ర‌లు చేసినా.. కుతంత్రాలు ప‌న్నినా వాటిని అధిగ‌మిస్తామ‌న్నారు.

తాజా వీడియోలు

Back to Top