ఇళ్ల పట్టాలు ఆలస్యం కావచ్చేమో గానీ.. ఇవ్వడం మాత్రం పక్కా

సీఎం వైయ‌స్ జగన్‌ మంచి చేస్తుంటే.. టీడీపీ కుట్రలు చేస్తోంది..
 
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

 విజయవాడ: ఈ నెల 8వ తేదీ పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలు ఆలస్యం కావచ్చేమో గానీ ఇవ్వడం మాత్రం పక్కా అని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.  పేదలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంచి చేస్తుంటే ప్రతిపక్షం కుట్ర చేస్తోందని  మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..నాడు దివంగత మహానేత వైయ‌స్ఆర్ ‌ ప్రతి పేదవారికి ఇళ్లను అందిస్తే.. అదే స్ఫూర్తితో నేడు ఆయన తనయుడు సీఎం వైయ‌స్‌ జగన్‌ పేదలకు ఇళ్ల స్థలాలను అందించేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. మొదట 25 లక్షలు అనుకున్నాం, 30 లక్షలు పేదలకు ఇళ్ళు స్థలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సిద్ధమయ్యార‌ని చెప్పారు. భూములు స్వచ్చందంగా ఇచ్చారు. భూ సేకరణ ద్వారా పేదలకు భూమి ఇచ్చేందుకు సిద్ధం అవుతుంటే ప్రతిపక్షం అడ్డంకులు సృష్టిస్తుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు.  కోర్టులు నుంచి స్టే  తీసుకు వచ్చి టీడీపీ కుట్రలు చేస్తోందని మంత్రి బొత్స మండిప‌డ్డారు. 

ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేప‌ట్ట‌లేదు
 టీడీపీ చేస్తున్న కుట్రలను ప్రజలను గమనిస్తున్నారని మంత్రి బొత్స తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేదని విమ‌ర్శించారు.  

రూ.10 కోట్ల‌తో మోడ‌ల్ పార్క్‌

విజయవాడ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు బొత్స తెలిపారు. నగరంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆదేశించారని పేర్కొన్నారు. సింగ్‌నగర్‌లో రూ.10 కోట్ల వ్యయంతో మోడల్‌ పార్క్‌ అభివృద్ధికి శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. ఏడాది లోపు పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Back to Top