రాజధాని ప్రాంతంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన

గుంటూరు: రాజధాని ప్రాంతంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్‌డీఏ అధికారులతో కలిసి పర్యటించారు. ఆలిండియా సర్వీస్‌ క్వార్టర్స్, ఎన్జీఓ, హెచ్‌ఓడీ టవర్స్‌ను పరిశీలించారు. భవన నిర్మాణ పనుల ఏ దశలో ఉన్నాయి.. ఇంకా ఏయే పనులు మిగిలి ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా జడ్జిల క్వార్టర్స్‌నూ మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు. భవన నిర్మాణాలకు సంబంధించి సీఆర్‌డీయే అధికారులతో మంత్రి బొత్స  సమావేశం కానున్నట్లు సమాచారం. 

Back to Top