ఓటమి తప్పదని తెలుసు.. అందుకే రాళ్ల దాడి డ్రామా

 మున్సిపల్‌ శాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ 

 ఈ ఎన్నికల్లో వైయస్సార్‌సీపీకి కచ్చితంగా 80 శాతం ఓట్లు వస్తాయి

మిగిలిన వాటిని బీజేపీ–జనసేనతో కలిసి పంచుకోవాలని..

 గతంలో చూశాం. మల్లెల బాబ్జీ. ఎన్టీఆర్‌ మీద కత్తితో దాడి

నాడు కూడా చంద్రబాబు నానా హంగామా చేశాడు

విశాఖపట్నం:  తిరుప‌తి ఉప ఎన్నిక‌లో టీడీపీకి ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలుసుని, అందుకే చంద్ర‌బాబు రాళ్ల దాడి అంటూ డ్రామాలాడుతున్నార‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. చంద్ర‌బాబుది పాత తరం ఆలోచన,  రాష్ట్రంలో మొన్న స్థానిక ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు తిరుపతి ఎంపీ సీటుకు ఉపఎన్నిక జరుగుతోంది. చంద్రబాబునాయుడు విన్యాసాలు, కుయుక్తులు ఒక్కోసారి ఒక్కో విధంగా వస్తుంటాయి. రాజకీయాల్లో తనది 40 ఏళ్ల అనుభవం అని చెబుతాడు. అంటే పాత తరం అన్నమాట. లేటెస్టు కాదు. అందుకే పూర్వం ఉన్న జిమ్మిక్కులు చూపిస్తున్నాడు. మొన్న పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాడు. నిన్న తిరుపతిలో తనపై రాళ్ల దాడి జరిగిందన్న సీన్‌ క్రియేట్‌ చేసి డ్రామా ఆడాడు. కింద ఎవరో కార్యకర్తను ఒక రాయి ఇవ్వమని అడిగి, కొత్త డ్రామాకు తెర తీశాడు. ఈ ఎన్నికల్లో ఎలాగూ ఓటమి తప్పదని తెలిసి, డిపాజిట్లు కూడా దక్కవని తెలిసి ఈ డ్రామా’ అని విమ‌ర్శించారు. విశాఖ‌లోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యంలో బొత్స స‌త్యనారాయ‌ణ మీడియాతో మాట్లాడారు.  

ఓటమి తప్పదని ఆయనకూ తెలుసు:
    ‘అక్కడ రెండు పార్టీలు మాతో పాటు పోటీ చేస్తున్నాయి. బీజేపీ–జనసేన కలిసి, కమర్షియల్‌ లైన్‌లో పోటీ చేస్తున్నాయి. అలాగే టీడీపీ కూడా పోటీ చేస్తోంది. చంద్రబాబునాయుడు ప్రచారానికి గంట ముందే బీజేపీ బహిరంగ సభ. దానికి పవన్‌కళ్యాణ్‌ క్వారంటైన్‌ పేరుతో డుమ్మా కొట్టాడు. ఇక చంద్రబాబు తన ప్రచారంలో రాళ్ల దాడి అని నానా హంగామా చేశాడు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పదని తెలుసు కాబట్టి. ఇది వారికి స్పష్టంగా తెలుసు. తమకు కనీసం డిపాజిట్లు కూడా రావని వారికి తెలుసు. ఈ ఎన్నికల్లో వైయస్సార్‌సీపీకి కచ్చితంగా 80 శాతం ఓట్లు వస్తాయని, మిగిలిన వాటిని బీజేపీ–జనసేనతో కలిసి పంచుకోవాల్సి ఉంటుందని చంద్రబాబుకు తెలుసు. అందుకే ఈ సిగ్గు లేని డ్రామా’.

దాడి జరగనే లేదు:
    ‘చంద్రబాబు అనుకూల మీడియానే చెబుతోంది. ఆయన ప్రచారానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారని. మరి అలాంటప్పుడు దాడిలో రాయి ఎలా కనిపిస్తుంది. అంతమందిలో ఎలా దాడి చేయగలుగుతారు? ఒక వేళ దాడి జరిగితే ఎవరు గాయపడ్డారు? అసలు ఎన్ని రాళ్లు వేశారు? అవన్నీ అక్కడ ఉండాలి కదా?. ఏదో ఒక రాయిని తీసుకుని చంద్రబాబు చూపాడు. నిన్న తిరుపతిలో చంద్రబాబు తనపై రాళ్ల దాడి జరిగిందన్న దానిపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేసి వాస్తవాలు కాసేపటి క్రితం చెప్పారు. చంద్రబాబు ప్రచారంలో రాళ్ల దాడి జరిగిన ఆనవాళ్లు లేవని వారు తెలిపారు’.
    ‘గతంలో కూడా చూశాం. మల్లెల బాబ్జీ. ఎన్టీఆర్‌ మీద కత్తితో దాడి చేశాడని ఆనాడు నానా హంగామా చూశాం. అంటే గతంలో కూడా చంద్రబాబు ఇలాంటివన్నీ చేశాడు. ఆయనకు ఇవన్నీ అలవాటే’.

సిగ్గు పడాలి–విశ్లేషించుకోవాలి:
    ‘చంద్రబాబు సిగ్గు పడాలి. ఏమిటి చంద్రబాబు ఇది? రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. మీకు ఓటమి కొత్త కాదు కదా? ఓడిపోయినప్పుడు హుందాగా అంగీకరించాలి. ఓటమికి కారణాలు విశ్లేషించుకోవాలి. అంతే కానీ విజ్ఞత కోల్పోయి, సహనం నశించి మాట్లాడకూడదు. రాత్రి ఏకంగా పోలీసులను, సీఎం గారిని దారుణంగా నిందించారు. ఏదైనా ఉంటే రాజకీయ కోణంలో, సిద్ధాంతపరంగా ఉంటే మాట్లాడు. నీవు ఏమైనా మంచి పనులు చేసి ఉంటే, వాటిని ప్రస్తావించు. అంతే కానీ వ్యక్తిగత దూషణలు నిందలు ఎందుకు?’.

నడ్డా తీరు గర్హనీయం:
    ‘ఇక పోతే రెండో పార్టీ. బీజేపీ–జనసేన కూటమి. బీజేపీ జాతీయ అధ్యక్షుడి మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతోంది. రాష్ట్రంలో ఇసుక దోపిడి జరుగుతోందని ఆయన ఆరోపించాడు. నిజానికి గత ప్రభుత్వ హయాంలో మీరు కూడా అధికారంలో భాగస్వామ్యం వహించినప్పుడే యథేచ్ఛగా దోపిడి జరిగింది. అందుకే ప్రజలు మిమ్మల్ని ఓడించారు’.
    ‘దేశంలో ఎక్కడైనా ఇన్ని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలువుతున్నాయా? చెప్పండి. ప్రతి నెల ఒకటవ తేదీ ఉదయమే ఇంటి తలుపు తట్టి పెన్షన్‌ ఇస్తున్నాం. అన్ని వర్గాల కోసం ఎన్నెన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం’.
    ‘వెంటనే మీ భాష మార్చుకోండి. మీ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండు రోజులు ఆగితే ప్రజలు ఓట్ల రూపంలో వారి నిర్ణయాన్ని చూపుతారు. ఇప్పటికైనా మీ మైండ్‌సెట్‌ మార్చుకోండి.
సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ పనితీరు, మాట నిలబెట్టుకునే విధానం, ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి, ఇటీవలి స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని అఖండ విజయంతో ప్రజలు గెలిపించారు. దీంతో మా బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నాం’.

భారీ మెజారిటీతో గెలుస్తాం:
    ‘ఇప్పుడు కూడా తిరుపతి ఉప ఎన్నికలో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని గట్టిగా నమ్ముతున్నాము. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలే గెలిపిస్తారు. కాబట్టి చంద్రబాబు ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించు. ఇంకా మీ కుయుక్తులు, కుట్రలు ఎన్నాళ్లో పని చేయవే. ప్రజలు మిమ్మల్ని నమ్మరు. మిమ్మల్ని చూసి వారు ఇప్పటికే విసిగిపోయారు. మీ పార్టీ ముగింపు దశలో ఉంది. అదే విధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు చేసిన ఆరోపణలు, విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాం’.

అచ్చెన్నాయుడు నిజమే చెప్పారు:
    ‘అచ్చెన్నాయుడు వాస్తవాలు చెప్పాడు. మనం అందరం రోజూ మైక్‌ల ముందు చెబుతున్నాం. అలా ఆయన చెప్పలేడు కాబట్టి, తన మనసులోని మాటను అలా బయట పెట్టాడు. తన అభిప్రాయాన్ని ఒక వ్యక్తితో చెప్పుకొచ్చాడు. బహిరంగంగా మాట్లాడలేడు కాబట్టి, నాలుగు గోడల మధ్య చెప్పాడు. వెనకట ఏదో సామెత ఉంది కదా.. ఆయనే ఉంటే.. అంటూ, సరిగ్గా దాన్నే కొంచెం భాష మార్చి లోకేష్‌ గురించి అచ్చెన్నాయుడు చెప్పాడు’.. అంటూ ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
ఇంకా..
    ‘తిరుపతి ఎన్నికలో దాదాపు 80 శాతం ఓట్లు వస్తాయని నమ్ముతున్నాం. ఎందుకంటే మేమే చేస్తున్న మంచి పనులే మమ్మల్ని గెలిపిస్తాయి. జనసేన నాయకుడు కరోనా పేరుతో ఇంటికే పరిమితం కాగా, చంద్రబాబు రాళ్ల దాడి అంటూ డ్రామా చేశాడు. దాడిలో దెబ్బలు లేవు. బాధితులు లేరు. రాళ్లు లేవు. సాక్ష్యులు కూడా లేరు. అయినా నానా హంగామా చేశాడు. ఏదేమైనా మేము అంత భారీ మెజారిటీతో గెలవబోతున్నాం కాబట్టి, ఇక మాకు ప్రత్యర్థులు ఎవరుంటారు?’.. అని మంత్రి బొత్స సత్యనారాయణ  తేల్చిచెప్పారు.
 

Back to Top