ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేయ‌డం సిగ్గు చేటు

 విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

ప్ర‌తిప‌క్షాల‌కు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడే హక్కు లేదు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ  అసెంబ్లీలో   తీర్మానం చేశాం

మంత్రి బొత్స‌స‌త్య‌నారాయ‌ణ‌

 విశాఖ‌: ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేయ‌డం సిగ్గు చేటు అని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ప్ర‌తిప‌క్షాలు ఎందుకు వ్య‌తిరేకిస్తున్నాయ‌ని ఆయ‌న‌ ప్ర‌శ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో రాజకీయపార్టీ నాయకులు కార్యక్రమాలు చేపడితే వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. శ‌నివారం విశాఖ‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

 విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను వైయ‌స్ఆర్‌ సిపి ప్రకటిస్తే ప్రతిపక్ష పార్టీలు కోర్టులు కెళ్ళి స్టేలు తెచ్చుకున్నారని చెప్పారు. ఏ మొహం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో చర్చావేదిక అంటున్నారని  నిల‌దీశారు.   విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ని వ్యతిరేకించిన మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడే హక్కు లేదన్నారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణను ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ నేరుగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో కూడా తీర్మానం చేశామన్నారు. నరేంద్రమోదీ క్యాబినెట్‌లో ఉన్న అశోక్ గజపతికి స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ అంశం తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఎందుకు అశోక్ గజపతి స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణను వ్యతిరేకించలేదన్నారు. విశాఖ ఉక్కు  ఆంధ్రుల హక్కు అన్నారు.  స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర నిర్ణయాన్ని వైయ‌స్ఆర్‌ సీపీ వ్యతిరేకిస్తుందని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top