విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలని ఈ కార్యక్రమం

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 
 

విజ‌య‌వాడ‌: విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలని జ‌గ‌న‌న్న ఆణిముత్యాలు  కార్యక్రమం ఏర్పాటు చేశామ‌ని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మన విద్యార్థి ఏ రాష్ట్రానికి వెళ్లినా పోటీతత్వంలో నిలబడతారు. విద్యార్థులే రేపటి భవిష్యత్తుగా తీర్చిదిద్దుతున్న ఏపీ ప్రభుత్వం అని చెప్పారు.  విజయవాడలో జ‌గ‌న‌న్న ఆణిముత్యాలు అవార్డులు ప్రదానం కార్య‌క్ర‌మంలో మంత్రి మాట్లాడారు.    
అందరికి నమస్కారం..గౌరవ సీఎం వైయస్‌ జగన్‌..సహచర మంత్రులకు, అధికారులకు అందరికి హృదయపూర్వక నమస్కారాలు
ఈ రోజు జగనన్న ఆణిముత్యాల కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులకు శుభాశిస్సులు..వారిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అభినందనలు.
రాష్ట్రంలో 22,710 మంది పది, ఇంటర్‌ విద్యార్థులను ఎంపిక చేసి అవార్ఢులు ఇస్తున్నాం. ఇవాళ సత్కరించబడుతున్న విద్యార్థుల నుంచి తోటివారిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం. చిన్నస్థాయి నుంచే ఇలాంటి అవార్డులు పొందేలా స్ఫూర్తివంతమైన కార్యక్రమం ఇది. అలాంటి విద్యార్థులను తయారు చేసిన ఉపాధ్యాయులను కూడా సత్కరిస్తున్నాం. వీరి ద్వారా తోటిఉపాధ్యాయులకు స్ఫూర్తి కలుగుతుంది. రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు పొందే ఆనందం చూడాలని, విద్యార్థుల్లో స్ఫూర్తి రావాలని ఈ కార్యక్రమం చేపడుతున్నాం.
ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా..విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రంలో విద్య అన్నది సంక్షేమం కాదు..అది ఒక పెట్టుబడి అని భావించి పోటీ ప్రపంచంలో మన పిల్లలు రాణించాలనే ఉద్దేశంతో సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారు. విద్యార్థులకు బోధనతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. నేను విద్యాశాఖ మంత్రిగా ఉండటం గర్వంగా భావిస్తున్నాను. విద్యరంగంలో ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని గర్వంగా చెబుతున్నాను. 
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు సామాన్య కుటుంబం నుంచి వచ్చారు.కార్పొరేట్‌కు ధీటుగా ఫలితాలు సాధించి ఆణిముత్యాలుగా నిలిచారు. ఇటువంటి కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామిగా ఉండటం గర్వంగా భావిస్తున్నాను. క్లాస్‌ రూముల్లో స్మార్ట్‌ టీవీలు పెట్టాం. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో నాలుగు ఐదు చోట్ల మాత్రమే స్మార్ట్‌ టీవీల్లో బోధనలు చేస్తున్నారు. కానీ మనరాష్ట్రంలో వేల సంఖ్యలో స్కూళ్లలో ఇలాంటి ఏర్పాట్లు చేశామన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌కు  భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ..ఆణిముత్యాలు అవార్డులు అందుకుంటున్న విద్యార్థులకు ఆశీస్సులు అందజేస్తూ మంత్రి సెలవు తీసుకున్నారు.

 

Back to Top