ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు

శ్రేయస్సు కావాలంటే వైయ‌స్‌ జగన్  నాయకత్వం ఉండాల్సిందే 

జ‌గ‌న‌న్న విద్యా దీవెన కార్య‌క్ర‌మంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

 తిరువూరు:  ఈ రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి ప్రజల‌ మనుగడ, శ్రేయస్సు కావాలంటే శ్రీ వైయ‌స్‌ జగన్‌ గారి నాయకత్వం ఉండాల్సిందేన‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. తాను మంత్రిగా సుదీర్ఘకాలం చేశాను, ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులకు అవకాశం వచ్చినరోజు ఎందుకు చేయలేదని నిల‌దీశారు. జ‌గ‌న‌న్న విద్యా దీవెన కార్య‌క్ర‌మం ఎన్‌టీఆర్‌ జిల్లా తిరువూరులో ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో  మంత్రి, విద్యార్ధులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే

బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి

అందరికీ నమస్కారం, ఈ రోజు పండుగ రోజు, విద్య అనేది సంక్షేమం కాదు పెట్టుబడి అని సీఎంగారు నమ్మారు, గత ప్రభుత్వాలు చూశాం కానీ దానికి భిన్నంగా నాడు మహానీయుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు ఏ స్పూర్తితో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చారో దానిని ఆయన తనయుడు ముందుకు తీసుకెళుతున్నారు. గతంలో లక్ష, లక్షా ఇరవై వేల ఆదాయం వరకే పరిమితమైన ఈ పథకాన్ని పేదలందరూ చదువుకునేలా రూ. 2.50 లక్షల వరకు పెంచి ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు సీఎంగారు. పేదలకు చేస్తున్న ఈ మేలును అడ్డుకోవడానికి కొంతమంది పెద్దలు, కొన్ని పత్రికలు, ప్రతిపక్షాలు ఎన్నో ఆటంకాలు కల్పిస్తున్నాయి, అయినా దేనికి తలవంచకుండా, అదరకుండా, బెదరకుండా తండ్రి తలపెట్టిన కార్యక్రమాన్ని నెరవేరుస్తున్న ఘనత సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారిది. ఈ రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి ప్రజల వారి మనుగడ, శ్రేయస్సు కావాలంటే శ్రీ వైయ‌స్‌ జగన్‌ గారి నాయకత్వం ఉండాల్సిందే, నేను మంత్రిగా సుదీర్ఘకాలం చేశాను, ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులకు అవకాశం వచ్చినరోజు ఎందుకు చేయలేదని అడుగుతున్నా, రేపు అధికారం ఇస్తే చేస్తామంటున్నారు, నమ్మవచ్చా, మీరే ఆలోచించండి. సీఎంగారు విద్యార్ధుల భవిష్యత్‌ ఈ రాష్ట్రానికి పెట్టుబడి అన్ని నమ్మిన నాయకుడు మన సీఎంగారు. ఆ భగవంతుడు సీఎంగారికి నిండు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, పది కాలాల పాటు మంచి చేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 

మహిజ చెర్రి బ్లాసమ్, బీటెక్‌ ఫైనలియర్‌ విద్యార్ధిని, లకిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్, మైలవరం

గుడ్‌ మార్నింగ్, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనేవి స్కీమ్స్‌ మాత్రమే కాదు, నాలాంటి ఎంతోమంది పేద విద్యార్ధులకు అవి వరాలు, మా అమ్మ సింగిల్‌ పేరెంట్, నన్ను ఎంతగానో చదివించాలనుకున్నా తనకు అంత స్ధోమత లేదు, నేను బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతూ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో నాలుగు జాబ్‌ ఆఫర్స్‌ పొందానంటే అది విద్యాదీవెన, వసతిదీవెన వల్లనే. నేను ఈ స్కీమ్‌ ద్వారా ప్రతి ఏడాది రూ. 69,700 పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్, వసతి దీవెన కింద రూ. 20,000 నాకు అందుతున్నాయి. ఒక నాయకుడు అంటే ప్రజల్ని పరిపాలించేవారు కాదు, తనలా ఎంతోమంది నాయకులను తయారుచేసేవారు, దానికి నిలువెత్తు సాక్ష్యం మా జగనన్నే, మీరు తెచ్చిన నవరత్నాలతో మా జీవితాలు రత్నాలుగా మారిపోయాయి, విద్యారంగంలో మునుపెన్నడూ లేని మార్పులు తీసుకొచ్చారు. విద్యారంగంలోనే అనేక పథకాలు తీసుకొచ్చి మాకు అండగా నిలిచారు, కేజీ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు. మా అమ్మకు కూడా వైఎస్సార్‌ చేయూత కింద రూ. 18,500 అందుతున్నాయి, ఒకటో తేదీ వితంతు ఫించన్‌ కూడా రూ. 2,750 ఇస్తున్నారు. నాలాంటి ఎంతోమంది పేదలకు మీరు అండగా ఉన్నారు, మా కరిక్యులమ్‌లో మీరు తీసుకొచ్చిన మార్పులు మాకు ఉపయోగపడుతున్నాయి. నేను ఈ రోజు రూ. 27 లక్షల కాంబో ఆఫర్‌లో ఇంజనీరింగ్‌ ప్లేస్‌మెంట్‌లో సెలక్ట్‌ అయ్యాను అంటే అది మీ చలవే, మాకు ఎంతో విలువైన సర్టిఫికేషన్‌ కోర్సులు కూడా ఫ్రీగా నేర్పించి మా కెరీర్‌కు ఉపయోగపడేలా మీరు తీర్చిదిద్దుతున్నారు. విదేశీ విద్య అనేది పేదలకు అందని ద్రాక్షలా ఉండేది, దానిని మీరు తిరగరాశారు, బయటికి వెళ్ళాలంటే ప్రతి ఆడపిల్ల భయపడే ఈ రోజుల్లో మీరు ప్రవేశపెట్టిన దిశ యాప్‌ ఇంటర్‌ఫేజ్‌లో మీ ఫోటో చూస్తే మాకు ధైర్యం వస్తుంది. ఈ రోజు మీరు ఆడపిల్లను చదివించడం లేదు, దేశ భవిష్యత్‌ కోసం ఒక ఆయుధాన్ని చదివిస్తున్నారు. మాకు ఇప్పుడు ఎప్పుడూ ఎల్లప్పుడూ అండగా ఉండాలి, అన్నగా తోడుండాలి అని కోరుకుంటున్నాం, ఆ దేవుడి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 

కొమ్ముకూరి పాప, జీఎన్‌ఎమ్‌ నర్సింగ్‌ విద్యార్ధిని, విజయవాడ

సార్‌ నేను వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చి ఈ రోజు నర్సింగ్‌ చదువుతున్నాను అంటే అది జగనన్న విద్యా దీవెన వల్లే, మన ఏపీలో ఒక బిడ్డ తల్లిగర్భంలో పెరిగేటప్పుడే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, తల్లి ఆరోగ్యంగా ఉండాలని అంగన్‌వాడీలను బలోపేతం చేసి జగనన్న గోరుముద్ద అనే పథకం ద్వారా మంచి పోషకాలు అందిస్తున్నారు. దీని వలన మాతాశిశు మరణాల సంఖ్య జీరోకి చేరుకుంది. అమ్మ ఒడి ద్వారా మంచి చదువులు చెప్పిస్తున్నారు, నాడు నేడు ద్వారా కార్పొరేట్‌ స్కూల్స్‌కి ఏ మాత్రం తగ్గకుండా మార్పులు తీసుకొచ్చారు, ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టారు, విద్యాకానుక ద్వారా అన్ని ఇస్తున్నారు, మీ ప్రేమకు మేం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం, మీరు మా కుటుంబ సభ్యుడిలా ఆలోచించి మా కాలేజ్‌ ఫీజులు పూర్తిగా మీరే చెల్లిస్తున్నారు. మేం నచ్చిన కాలేజ్‌లో నచ్చిన కోర్సు చదువుతున్నాం అంటే మీరే కారణం, గతంలో ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌ రూ. 1.50 లక్షల లోపు ఉంటే ఇచ్చేవారు కానీ మీరు రూ. 2.50 లక్షల వరకు పెంచి మాకు పథకాలు అందిస్తున్నారు. మేం చాలా సంతోషంగా ఉన్నాం, ఉన్నత విద్యలో అనేక మార్పులు తీసుకొచ్చారు, మీ పెద్ద మనసుకు మా కృతజ్ఞతలు, విదేశీ విద్యా దీవెనలో ఎవరూ ఊహించని విధంగా రూ. 1.25 కోట్లు చెల్లిస్తున్నారు అంటే విద్యపై, విద్యార్ధులపై మీకు ఉన్న అభిమానానికి నిదర్శనం, ఇవన్నీ మాటలు కాదు చేసి చూపిన నాయకుడు మీరు. మా అమ్మకు జగనన్న చేయూత ద్వారా రూ. 18,500 అందాయి, ఆ డబ్బు మా అమ్మ నా భవిష్యత్‌ కోసం డిపాజిట్‌ చేశారు, మీరు వైజాగ్‌లో నిర్వహించిన గ్లోబల్‌ సమ్మిట్‌ ద్వారా లక్షలాది మంది విద్యార్ధులకు ఉద్యోగావకాశాలు కల్పించే  మీ సంకల్పానికి సెల్యూట్‌ చేస్తున్నాను సార్, ధ్యాంక్యూ.

Back to Top