వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానం

మంత్రి బొత్స సత్యనారాయణ

హైకోర్టు తీర్పుపై కొన్ని మీడియా సంస్థలు వక్రభాష్యం  చెబుతున్నాయి

సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు

మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం

రాజధాని అంటే భూములు, ఓ సామాజిక వర్గం కాదు

తాడేపల్లి: పరిపాలనా వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలదేనని కేంద్రం చెప్పిందన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశమని ఉద్ఘాటించారు.  రాజధాని అంటే భూములు, ఓ సామాజిక వర్గం కాదన్నారు. మూడు రాజధానులకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. మూడు రాజధానులపై హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. హైకోర్టు తీర్పును కొన్ని మీడియా సంస్థలు వక్రీకరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియా పాయింట్‌ వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు.

మంత్రి ఏమన్నారంటే..బొత్స సత్యనారాయణ మాటల్లోనే..

పరిపాలన వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. ఈ విధానానికి నూటికి నూరు 
శాతం కట్టుబడి ఉన్నాం. మేం శాసన సభలో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నారం. రాజధాని అంటే ఒక సామాజిక వర్గం కాదు. అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన అంశం.  రాజధాని అంటే ప్రజలు..అంతే కాని అక్కడున్న భూములు, సామాజిక వర్గం కాదు. రాజధాని ఫలాలు అందరూ అనుభవించాల్సిందే. అందరి మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలి. అదే కార్యక్రమాలను మా సీఎం తీసుకున్నారు. 

కేంద్రమే రాజధాని అంశం రాష్ట్ర పరిధిలో ఉందని పార్లమెంట్‌లో స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు అంశంపై న్యాయ నిపుణులతో మాట్లాడి ముందుకు వెళ్తాం. సుప్రీం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కొన్ని మీడియా సంస్థలు హైకోర్టు తీర్పును వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయి. మా కార్యక్రమాలు మాకున్నాయి. 

ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసేలా కార్యక్రమాలు చేపడుతాయి. రాష్ట్రాభివృద్ధికి వికేంద్రీకరణ ముఖ్యమని మేం నమ్ముతున్నాం.

పునర్‌విభజన చట్టం ప్రకారం ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ సూచనలు గత ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు. అప్పట్లో నారాయణ కమిటీ నిర్ణయాన్ని ఎందుకు అనుసరించారు. సుప్రీం కోర్టుకు Ðð ళ్లాల్సిన అవసరం లేదు. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో రెండు, మూడు రాజధానులు ఎందుకు పెడుతున్నారు. అభివృద్ధి కోసమే కదా?
రాజధాని నిర్మించాలంటే సమయం, ఖర్చు, నిధుల అనే మూడు అంశాలపై ముడిపడి ఉంది. ఈ అంశాలపై చర్చిస్తున్నాం. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల అభిప్రాయాలను తీసుకుంటాం. ఒక వర్గం అభిప్రాయంతో ముందుకు వెళ్లం. ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం రాజధాని.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రా«జధాని విషయాన్ని ఏం చేశారు. మేం వ్యక్తుల కోసం కార్యక్రమాలు చేయం. వ్యవస్థను ప్రతిష్టం చేసేందుకు కార్యక్రమాలు చేపడుతాం. ఏదైనా సమాఖ్య వ్యవస్థకు లోపడి ఉండాలి. భూములు ఇచ్చిన రైతులకు డెవలప్‌మెంట్‌ ప్లాట్లు ఇవ్వమన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం చెప్పినవన్నీ చేస్తున్నాం.  మా ప్రభుత్వ విధానం వికేంద్రీకరణ అని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు ఇస్తామన్నవి అన్ని ఇస్తున్నాం కదా? సీఎం ఎందుకు? ఎవరికి క్షమాపణ చెప్పాలని మంత్రి నిలదీశారు. 
 

తాజా వీడియోలు

Back to Top