ఈ రోజుతో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి

మంత్రి బొత్స సత్యనారాయణ
 

తాడేపల్లి:  ఈ రోజుతో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న ఉద్యోగులతో చర్చలు సానుకులంగా జరిగాయని తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం మళ్లీ ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామన్నారు. సమస్యకు పరిష్కారం ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు. హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లపై కూడా చర్చించామని తెలిపారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం..కొన్ని అభిప్రాయ భేధాలు రావచ్చు అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి నిన్నటి చర్చల అంశాలను తీసుకెళ్తామని చెప్పారు. ఉద్యోగ సమస్యలపై సానుకూల నిర్ణయమే తీసుకుంటామని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు.
 

Back to Top