చంద్రబాబు ప్రతి మాటలోనూ రాజకీయ స్వార్థమే

టీడీపీ సభ్యులు కావాలనే రభస చేస్తున్నారు

మంత్రి  బొత్స సత్యనారాయణ

అమరావతి: చంద్రబాబు మాట్లాడే ప్రతి  మాటలోనూ రాజకీయ స్వార్థమే ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. టీడీపీ నేతలు వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తున్నారు. కావాలని సభను తప్పుదోవ పట్టిస్తున్నారు.  సొంత మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదన్నారు. సభలో కుటుంబ సభ్యుల ప్రస్తావన చంద్రబాబే తీసుకువచ్చారు. చద్రబాబు అనే వ్యక్తిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రతి మాటలోనూ రాజకీయ స్వార్థం కనిపిస్తుంది. ప్రజలకు సంబంధించినది, సభకు సంబంధించిన అంశాలు చంద్రబాబు వ్యాఖ్యల్లో లేవు. రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాటిపై సీఎం వైయస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వాటి గురించి ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు మాత్రం కుటుంబ సభ్యుల ప్రస్తావన తెచ్చారు. చంద్రబాబు నేర మైండ్‌తో ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు. అందుకే ఇవాళ వాళ్లు సభను బహిష్కరించి బయటకు వెళ్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top