తప్పు చేసినవారికి ఎప్పటికైనా శిక్ష తప్పదు

మంత్రి బొత్స సత్యనారాయణ

తాడేపల్లి: తప్పు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ ఎక్కువ రోజులు తప్పించుకోలేరని చెప్పారు. సీఐడీ నోటీసులకు చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. అమరావతి పేరుతో భూ కుంభకోణం జరిగిందని ప్రతిపక్షంలోనే చెప్పామన్నారు. ప్రభుత్వానికి కక్షసాధించాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు  ప్రజలకు జవాడుదారీగా ఉండాలన్నారు. నిన్నటి వరకు మేం తప్పు చేస్తే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. సీఐడీ నోటీసులు ఇవ్వగానే కక్షసాధింపు అంటున్నారని తెలిపారు. తప్పు చేయకపోతే చంద్రబాబుకు భయమెందుకని నిలదీశారు.

 

తాజా వీడియోలు

Back to Top