నిమ్మ‌గ‌డ్డకు రాజ‌కీయాలు కావాలంటే రాజీనామా చేసి బ‌య‌ట‌కు రావాలి

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

గ‌వ‌ర్న‌ర్‌కు నిమ్మ‌గ‌డ్డ రాసిన లేఖ‌ను ఖండిస్తున్న

వైయ‌స్ఆర్ జిల్లాలో సీబీఐ కేసుల గురించి ఎందుకు మాట్లాడారో ఎస్ఈసీ స‌మాధానం చెప్పాలి

ఎస్ఈసీకి స‌భా ఉల్లంఘ‌ట‌న నోటీసులు జారీ చేశాం

గ్రామ స్వ‌రాజ్యం రావాలంటే ఏక‌గ్రీవాలు జ‌ర‌గాల‌న్న‌దే మా విధానం

విశాఖ‌:  రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌కు రాజ‌కీయాలే కావాల‌నుకుంటే ఆ ప‌ద‌వికి రాజీనామా చేసి బ‌య‌ట‌కు రావాల‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయణ సూచించారు. ఇవాళ వైయ‌స్ఆర్ జిల్లా ప‌ర్య‌ట‌ట‌న‌కు నిమ్మ‌గ‌డ్డ ఎన్నిక‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు వెళ్లారా?  రాజ‌కీయాలకు వెళ్లారా ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండు చేశారు. త‌న‌పై, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగేలా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ రాశార‌ని, ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్రివిలెజ్ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు. శ‌నివారం విశాఖ‌లో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. 

 • పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నేను లక్ష్మణరేఖ దాటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖను, అందులో ఆయన పేర్కొన్న అంశాలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. మా హక్కులకు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించించే విధంగా మాపై ఆరోపణలు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని స్పీకర్ ను కోరినట్లు మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖపట్నం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ- ఎన్నికలకు సంబంధం లేని అంశాలను పదే పదే మాట్లాడుతూ.. రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ, ద్వంద్వ ప్రమాణాలతో, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికి ఎన్నిసార్లు లక్ష్మణ రేఖ దాటారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు.
 •  రాజ్యాంగ పదవి అయిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కుర్చీలో ఉన్న వ్యక్తి  నిష్పక్షపాతంగా ఉండాలి. వాస్తవ దృక్ఫథంతో ఉండాలి. అలాకాకుండా, మా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా, కించపరిచే విధంగా గవర్నర్ కు లేఖ రాశారు. వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం.  రాజకీయాల్లోకి కొత్తగా మేం రాలేదు. నేను మొదటిసారి కేబినెట్ మంత్రిని కాదు. మూడోసారి కేబినెట్ మంత్రిని, పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేశాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా చాలా సీనియర్ మంత్రి.  చట్టం, రాజ్యాంగం పట్ల ఎప్పుడూ గౌరవంతో, వాటికి లోబడి పనిచేసే వాళ్ళం. ఎప్పుడూ మేం వాటిని ఉల్లంఘించలేదు. ఆ ఆలోచనలు కూడా మాకు లేవు. ఎస్ఈసీ దురుద్దేశంతో, ఏకపక్షంగా మాకున్న హక్కులు, గౌరవాన్ని భంగం కలిగిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల చాలా ఆవేదన చెందాం. బాధపడుతున్నాం. మా మీద ఇలాంటి అపవాదులు వేయటం సమంజసం కాదు. మా హక్కుల్ని మీరే కాపాడాలని స్పీకర్ ను కోరాం. 
 •   గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు ఈ రాష్ట్రంలో బాటలు వేస్తున్నాం. అందులో భాగంగా గ్రామాలలో కక్షలు కార్పణ్యాలకు తావులేకుండా, పార్టీల రహితంగా జరిగే పంచాయితీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ప్రభుత్వం కోరుకుంటుంది. అందుకే ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నాం. అందులో తప్పేముంది..? దానికి విరుద్ధంగా ఎన్నికల కమిషన్ మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్న మాటలు, ఆయన తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు సరికాదు అని చెబుతున్నాం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని పదే పదే చెబుతున్నా ఆయన వ్యవహార శైలిలో మార్పు రావటం లేదు.
 •  మరోవిషయం ఏమిటంటే... గవర్నర్ చేత నియమించబడిన ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్.. గవర్నర్ గారికి రాసిన లేఖలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ మీద విశ్వాసం లేదు, అటార్ని జనరల్ తో మీరు సమాచారం తెలుసుకుని, చర్యలు తీసుకోండి,  ఇదే ఆఖరిసారి, లేకపోతే కోర్టుకు వెళతామని రాయటం అంటే అది లక్ష్మణ రేఖను దాటడం కాదా..? గవర్నర్ ను బెదిరించే విధంగా ఎస్ఈసీ లేఖ రాసిన సందర్భం గతంలో ఎప్పుడూ చూడలేదు. గవర్నర్ కు రాసిన లేఖలో ఎస్ఈసీ వ్యాఖ్యలు చూస్తే బాధేస్తుంది.
 •  కోవిడ్ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రజల ప్రాణాలకు నష్టం కలుగుతుందని ప్రభుత్వంగా మేం చెప్పాం. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తూ.. ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికలకు పూర్తిగా సహకరిస్తుంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ప్రభుత్వం కోరుకుంటున్న సందర్భంలో.. నిన్న, ఈరోజు ఎస్ఈసీ అనంతపురం, కడప జిల్లాల్లో పర్యటిస్తూ.. మీడియా సమావేశాల్లో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే.. పూర్తిగా రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా, గ్రామాల్లో వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా ఉన్నాయి. 
 •  రాజ్యాంగం గురించి, చట్టం గురించి స్పీచ్ లు ఇచ్చిన ఎస్ఈసీ,  మీడియా అడిగిన ప్రశ్నలకు ఏరకంగా ఆయన ఛీత్కరించుకున్నారో, అక్కడ నుంచి ఏరకంగా జారుకున్నారో కూడా ప్రజలంతా చూశారు. ఎన్నికల కమిషనర్ జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు.. ఎన్నికల గురించి, ఏర్పాట్లు గురించి మాట్లాడటం మనం చూశాం. ఈరోజు కడప పర్యటనకు వెళ్ళి ఎస్ఈసీ వైయస్ఆర్ గారి గురించి మాట్లాడారు, సీబీఐ కేసుల గురించి కూడా మాట్లాడారు, భయం, భక్తుల గురించి కూడా మాట్లాడారు. ఇది సందర్భమా..? వీటికి, ఎన్నికలకు ఏమన్నా సంబంధం ఉందా..? ఇది ఎన్నికల కమిషన్ బాధ్యతా.. అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎన్నికలతో సంబంధం లేని విషయాలను ముందుకు తీసుకొచ్చి, ఏ విధంగా ద్వంద్వ వైఖరితో ఎస్ఈసీ భాష, భావం ఉందో అర్థమవుతుంది. దీనినిబట్టి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్..  ఏ రేఖ దాటారు..? లక్ష్మణ రేఖ దాటి మాట్లాడారా..  లేక లోబడి మాట్లాడారో ఆయనే సమాధానం చెప్పాలి.  
 •  ఏ మీడియా సమావేశం చూసినా.. నిమ్మగడ్డ పరిధిని దాటి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ.. ఎవరికో లబ్ధి చేకూర్చే విధంగా ఈయన పనిచేస్తూనే ఉన్నారు. ఇది ఒక దుష్ట సంప్రదాయం. రాబోయే తరాలకు ఇదొక దుష్ట సంప్రదాయంగా కనిపిస్తుంది. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. రాజ్యాంగ పరిధిలో ఉన్న వ్యక్తులం ఇలా వ్యవహరించకూడదు. ఆత్మ సాక్షిగా, భగవంతుని సాక్షిగా ప్రమాణం చేసి పదవులు చేపట్టిన వ్యక్తులం అందరం కూడా. ఎవరి పరిధిల్లో వారు ఉండి, ఎవరి బాధ్యతలు వారు గుర్తెరిగి, అధికారంతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యం అనుకుని విధులు నిర్వర్తించాలి. కడపలో ఎస్ఈసీ మాట్లాడిన మాటలు చూస్తే బాధగా ఉంది. 
 •  కడప పర్యటనకు వెళ్ళి.. స్వర్గీయ వైయస్ఆర్ గారి కుటుంబం గురించి నిమ్మగడ్డ  మాట్లాడిన మాటలు, ఆయన ద్వంద్వ వైఖరి చూస్తే.. ఆయనకు ఆ కుటుంబంపై ఉన్న అక్కసు కనిపించింది. రాజకీయాలు మాట్లాడాలంటే.. ఎస్ఈసీ పదవి నుంచి బయటకు రండి.  కడపలో ఎన్నికలకు సంబంధం లేని విషయాలను మాట్లాడుతూ, వ్యక్తులను ఎత్తిపొడుస్తూ.. ఆయనే మేధావిలా, ఆయన ఒక్కడికే తెలివి ఉన్నట్టు నిమ్మగడ్డ మాట్లాడారు. 
 •   రాష్ట్రంలో ఎన్నికలు శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నాం. ఎన్నికల కమిషనర్ ను కూడా అదే కోరుతున్నాం.. గ్రామాల్లో చిచ్చు పెట్టకండి. మీ రాజకీయ వ్యాఖ్యలతో వాతావరణాన్ని కలుషితం చేయవద్దు అని చెబుతున్నాం. 
 •   పార్టీ రహితంగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిందిపోయి.. ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేని విషయాలను ఆయన మాట్లాడుతూ.. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 
 •   ఏకగ్రీవాల పేరుతో.. ఎవరైనా బలవంతంగా చేస్తే అప్పుడు మాట్లాడాలి, అలాకాకుండా, ఏకగ్రీవాలు అసలు జరగకూడదన్నట్టుగా ఎస్ఈసీ ఎందుకు మాట్లాడుతున్నారు.. ? ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు..?
 •  నిమ్మగడ్డ ఎన్నికలను పర్యవేక్షించడానికి వెళ్ళాడా.. లేక హరికథలు చెప్పడానికి వెళ్ళాడా..? రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్నవారు  ఎవరైనా పరిధి దాటకూడదు. ప్రతి ఒక్కరికీ ఒక రాజ్యాంగం ఉండదు కదా.. అందరికీ ఒకే రాజ్యాంగం, ఒకే చట్టం, ఒకటే వాక్ స్వాతంత్ర్యం ఉంటుందన్నది నిమ్మగడ్డ గుర్తుంచుకోవాలి.
 •   ఎన్నికల కమిషనర్ పదవిలో ఉండి, ఎంపైర్ గా ఉండాల్సన వ్యక్తి చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసినా.. ఎంత మంది దుష్ట శక్తులు కట్టకట్టుకుని వచ్చినా.. అంతిమంగా 95 శాతం మాదే విజయం.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top