అన్ని ప్రాంతాలు, వర్గాల అభివృద్ధే ధ్యేయంగా అధికార వికేంద్రీకరణ 

బీసీల అభివృద్ధికి ఎవ్వరూ పాటుపడలేదు

బీసీల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది

మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ: సమ సమాజ స్థాపనలో భాగంగా అన్ని ప్రాంతాలు, వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఈ రోజు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికార వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గతంలో పరిపాలన చేసిన ఎవరూ కూడా బీసీల గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన బీసీ సంక్రాంతి కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు .మనందరికి ఈ రోజు ఒక శుభదినం. అరగంట ముందు రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాలకు చెందిన ప్రతినిధులుగా, వైయస్‌ జగన్‌ సారధ్యంలో నియమించబడిన 56 మంది కార్పొరేషన్‌ చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు..ఎన్నికల తరువాతి పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏలూరులో బీసీ గర్జన జరిగింది. ఆ రోజు మన పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ఏం చెప్పారో..ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నారో గుర్తు చేసుకోవాలి. బీసీలంటే వెనుకబడిన తరగతులు కాదు..ఈ వ్యవస్థలో వారు బ్యాక్‌ బోన్‌ అని అభివర్ణించిన సీఎం వైయస్‌ జగన్‌ దాన్ని ఆచరణలో చేసి చూపించారు.ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆయా కులాలకు మిమ్మల్ని ప్రతినిధులుగా చేసి  వైయస్‌ జగన్‌ మాట నిలబెట్టుకున్నారు. ఏదైనా కార్యక్రమం చేస్తే..అది రాజకీయాల్లో చిరస్థాయిగా ఉండాలి. అలాంటి పరిస్థితిని ఆ రోజు వైయస్‌ రాజశేఖరరెడ్డి చేశారు. ఆయన తనయుడిగా సీఎం వైయస్‌ జగన్‌ చేశారు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఈ కార్యక్రమాలను ముట్టుకునే పరిస్థితి లేకుండా చేశారు.

ఈ కార్పొరేషన్లు చిరస్థాయిగా ఉంటాయి. ఈ విధంగా ముఖ్యమంత్రులు చేయాలి. అవకాశాలను అందిపుచ్చుకొని గతంలోని ముఖ్యమంత్రులు వారి అభివృద్ధినే చూసుకున్నారు. బీఆర్‌ అంబేద్కర్‌ కోరిన సమ సమాజ స్థాపన కోసం బీసీలు, బడుగు, బలహీన వర్గాలకు అవకాశాలు, అధికారాలు ఉండాలి. సమసమాజానికి వైయస్‌ జగన్‌ ఒక నాంది పలికారు.  అంబేద్కర్‌ ఆలోచన, దృక్ఫథంలో వైయస్‌ జగన్‌ పాలన సాగిస్తున్నారు. ఇవాళ పదవులు పొందిన వారు వైయస్‌ జగన్‌ ఆలోచనను గుర్తు పెట్టుకొని ఆయా కులాలకు మేలు చేయాలన్నారు. ఆ కులంలో ఏ సమస్య ఉన్నా..ఏ కార్యక్రమం ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందన్న నమ్మకాన్ని తీసుకురావాలన్నారు. ఇది ఒక బాధ్యత గల పదవని గుర్తించుకోవాలి. అందరూ కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ఇచ్చిన పదవికి కీర్తి తీసుకురావాలన్నారు. గత ప్రభుత్వాలు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. ఏ ఒక్కరూ కూడా బీసీలకు మేలు చేయలేదన్నారు.

సీఎం వైయస్‌ జగన్‌ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో మాకు చెప్పారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, మంత్రుల అభిప్రాయాలు అడిగితే మేం సరే అన్నామని చెప్పారు. రాజకీయ ఇబ్బందులు వస్తాయని మేం చెబితే...అన్నా..ఏ ఇబ్బంది వచ్చినా..కష్టం వచ్చినా మనం బలహీన వర్గాల పక్షపాతిగా ఉండాలి..ఇచ్చిన మాటను నెరవేర్చుదామని వైయస్‌ జగన్‌ మాతో అన్నారని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. బీసీల పట్ల వైయస్‌ జగన్‌ ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో ఆలోచన చేయాలన్నారు. వైయస్‌ జగన్‌ చేస్తున్న నిర్ణయాలు, కార్యక్రమాలు, బీసీల పట్ల ఉన్న ప్రేమను ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. గతంలో బీసీల గురించి ఎవరూ ఏమీ చేయలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని వైయస్‌ జగన్‌అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. వ్యవస్థలను ఏవిధంగా చెప్పు చేతుల్లో పెట్టుకొని గతంలో అధికారంలో ఉన్న వారు ఏం చేశారో చూస్తున్నాం. కొన్ని పత్రికలు ఉన్నవి లేనట్లు అవాస్తవాలు ప్రచురిస్తున్నాయి, ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ముఖ్యమంత్రిపై ఇవాళ కొన్ని శక్తులు దాడికి పాల్పడుతున్నారు. ఆ కుట్రలను మనం ఎదుర్కొవాలి. ఆ దాడి సీఎం వైయస్‌ జగన్‌పైనే కాదు..మనందరిపై జరుగుతున్న దాడిగా భావించాలి. ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి సమస్య పరిష్కారం పట్ల కాలానికి అనుగుణంగా విధానాల్లో మార్పులు తీసుకుంటూ ముందుకు వెళ్లడమే సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, సమ సమాజ స్థాపనకు పరిపాలన చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు అధికార వికేంద్రీకరణ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఒక ప్రాంతం, ఒక సామాజిక వర్గం  అభివృద్ధే కాదు..అన్ని ప్రాంతాలు, అన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచనకు అనుగుణంగా మనందరం కూడా వైయస్‌ జగన్‌ వెన్నంటి ఉందామని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top