చంద్ర‌బాబు ప్రోద్బ‌లంతోనే నిందితుల త‌ర‌ఫున లాయ‌ర్లు వాదించారు

నంద్యాల ఘ‌ట‌న బాధ్యుల‌పై 306 సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేశాం

పేద‌ల‌కు ఇళ్లు ఇద్దామంటే టీడీపీ నేత‌లు కోర్టుకు వెళ్తున్నారు

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ

తాడేప‌ల్లి: ప‌్రతిప‌క్ష‌నేత చంద్ర‌బాబు ప్రోద్బ‌లంతోనే నంద్యాల ఘ‌ట‌న నిందితుల‌కు బెయిల్ మంజూరైంద‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. నిందితుల బెయిల్ పిటిష‌న్ వేసింది టీడీపీకి చెందిన లాయ‌రే అని విమ‌ర్శించారు. న‌ంద్యాల ఘ‌ట‌న‌పై టీడీపీ రాజ‌కీయం చేయాల‌ని చూస్తుంద‌ని, ఈ  ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌మంతా విచారం వ్య‌క్తం చేస్తే టీడీపీకి చెందిన లాయ‌ర్ల‌తో నిందితుల బెయిల్ పిటిష‌న్ వేయించార‌న్నారు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల‌తో చ‌ర్య‌లు తీసుకున్నార‌ని చెప్పారు. బుధ‌వారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. నంద్యాల ఘ‌ట‌న‌పై  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వెంట‌నే స్పందించార‌న్నారు. సీఎం  ఆదేశాల‌తో సీఐ, కానిస్టేబుల్‌పై చ‌ర్య‌లు తీసుకున్నారు. ఎప్పుడైనా ఇలాంటి  చ‌ర్య‌లు టీడీపీ ప్ర‌భుత్వంలో తీసుకున్నారా?. టీడీపీ నేత‌లు ఒక్క‌సారి ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోవాల‌న్నారు. అరెస్టుఅయిన త‌రువాత సీఐ, కానిస్టేబుల్‌పై 306 సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేశామ‌న్నారు. ఇది బెయిల‌బుల్ సెక్ష‌నా అని ప్ర‌శ్నించారు. ఈ కేసును ఎవ‌రు వాధించారు. ఆ లాయ‌ర్‌కు ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? ఎవ‌రు ప్రోత్స‌హిస్తే ఈ లాయ‌ర్ వాదించారు? . ఆ లాయ‌ర్ మీ పార్టీ నేత కాదా? అని నిల‌దీశారు.  టీడీపీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న రామచంద్రరావు నిందితుల తరపున బెయిల్ పిటిషన్ వేశారని తెలిపారు. న్యాయస్థానంలో నిందితులకు బెయిల్‌ కూడా మంజూరైందని, బెయిల్ రద్దు చేయాలని తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరినట్లు తెలిపారు. మంచి చేయాలని తాము ఆలోచిస్తుంటే..  ఎలా బురద జల్లాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. మీ పార్టీ ప్రోత్స‌హించ‌డంతోనే క‌దా ఆయ‌న వాదించి బెయిల్ ఇప్పింది వాస్త‌వం కాదా? అని ప్ర‌శ్నించారు. 

పేద‌వారికి ఇళ్ల ప‌ట్టాలు ఇస్తామంటే మీరే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటారు. అవినీతిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటే..వాటిపై స్టేలు తెచ్చింది వాస్త‌వం కాదా? . మీ పార్టీకి చెందిన రామ‌చంద్ర‌రావును లాయ‌ర్‌గా నియ‌మించి స‌లాం కేసులోనిందితుల‌కు బెయిల్ ఇప్పించార‌న్నారు. నా స్థ‌లం..నా హ‌క్కు అంటూ రోడ్డెక్కి ధ‌ర్నాలు చేశారు. టీడీపీ నేత‌ల‌కు సిగ్గుండాలి. పేద‌వారికి ఇల్లు ఇవ్వ‌కుండా అడ్డుకున్న మీరే ఇలాంటి రాజ‌కీయాలు చేయ‌డం బాధాక‌రం. స‌లాం కేసులో లాలూచీ ప‌డింది మీరు..బెయిల్ ఇప్పించి మీరు..తిరిగి మాపై బుర‌ద జ‌ల్లుతారా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఐదేళ్ల‌లో టీడీపీ ప్ర‌భుత్వం టిడ్కో ద్వారా ఒక్క ఇళ్లైనా ఇచ్చారా?. పేద‌ల వ‌ద్ద ఇళ్ల పేరుతో వ‌సూలు చేసి దోపిడి చేసింది మీరు కాదా అన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌నుఅడ్డుకుంటూ..ఇప్పుడు  నంగ‌నాచి లాగా వ‌చ్చి టీడీపీ నేత‌లు మాట్లాడ‌టం హాస్యాస్ప‌దమ‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లోనే ఇళ్లులేని ప్ర‌తి పేద‌వాడికి సొంత  ఇల్లు ఉండాల‌ని చెప్పార‌ని గుర్తు చేశారు. నారా లోకేష్ నిన్న మాట్లాడారు. వారి మాట‌లు వింటే న‌వ్వొస్తుంది. సీఎం దృష్టికి వచ్చిన ప్ర‌తి అంశంపై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.  నంద్యాల ఘ‌ట‌న‌పై చంద్ర‌బాబు ఇంటి ముందే ధ‌ర్నా చేయాల‌న్నారు. వాళ్లు చేస్తే వృత్తి, ఇత‌రులు చేస్తే ప్ర‌వృత్తా అని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు అమాయ‌కులు, మీరు చెప్పిందంతా వింటారా అని దుయ్య‌బ‌ట్టారు. ద్వంద వైఖ‌రీ, ద్వంద విధానాలు మానుకోవాల‌ని, సామాన్యుల‌కు ఇ బ్బంది క‌లిగించేలా ధ‌ర్నాలు చేయ‌డం స‌రికాద‌న్నారు. నీచ రాజకీయాలు మానుకోవాల‌ని టీడీపీ నేత‌ల‌కు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ హిత‌వు ప‌లికారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top