చంద్రబాబు నైజం మార్చుకోనంత కాలం నిరసనలే  

విశాఖలో రెండు పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు చంద్రబాబు వెళ్లారు

చంద్రబాబు తన ఉన్మాదాన్ని ప్రజలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు

పోలీసులను అగౌరవపరిచేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు

40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పి టీడీపీ గుండాలతో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు

అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే వికేంద్రీకరణ నిర్ణయం

విశాఖ ప్రజలు ఎంత సౌమ్యంగా ఉంటారో..హక్కుల కోసం అంతే పోరాటం చేస్తారు

విశాఖలో అభివృద్ధి వద్దని చెబితే..నిరసన తెలపకుండా స్వాగతిస్తారా?

రాష్ట్రంలో అభివృద్ధికి ఆటంకం కలిగించాలన్నదే చంద్రబాబు దుర్భుద్ధి

మంత్రి బొత్స సత్యనారాయణ

తాడేపల్లి: చంద్రబాబు తన నైజం మార్చుకునేంత వరకు విశాఖలో ఎదురైన నిరసనలే రాష్ట్రమంతా ఉంటాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పెళ్లిళ్లకు హాజరవుతున్న చంద్రబాబు అందులో కూడా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సిగ్గు చేటు అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబుకు నిరసన తెలపకుండా స్వాగతిస్తారా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 
వ్యక్తిగత పర్యటనను చంద్రబాబు రాజకీయానికి వాడుకోవాలని చూశారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. టీడీపీ గుండాలతో విశాఖలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.  

ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో చంద్రబాబు ఆయన తాలుక రాజకీయ స్వార్థం కోసం చేస్తున్న ఒక దురాచారమైన విధానం, మాటలతో రెచ్చగొడుతూ చేస్తున్న కార్యక్రమాలు ప్రజలంతా చూస్తున్నారు. ఇవాళ, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో చంద్రబాబు పర్యటన అంటూ విశాఖలో ఆయన తోడళ్లుడి తమ్ముడి కూతురు తాలుక వివాహం, టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడి ఇంట్లో శుభకార్యంలో పాల్గొనేందుకు వెళ్లాలి. కానీ నిన్నటి నుంచి చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఉత్తరాంధ్ర ప్రజలను చులకనభావంతో, హేళనగా మాట్లాడుతున్నారు. ఆయన మాటలు వింటే ఎంతో బాధగా ఉంటుంది. వెనుకబాటుతనంతో ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలను, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ జిల్లాను సీఎం వైయస్‌ జగన్‌ ఎగ్జిక్యూటీవ్‌ క్యాపిటల్‌గా ప్రకటించారు. చంద్రబాబు తన అక్కసు..ఆ ప్రాంతం అభివృద్ధి చెందకూడదని, ఇంకా వెనుకుబాటుతనంతో ఉండాలని, ఆయన అడుగులకు మడుగులు ఒత్తాలని ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబుకు, ఆయన పార్టీకి ఆ ప్రాంత ప్రజలు అండగా నిలిచారు. అలాంటి ప్రాంతానికి, ప్రజలను హెచ్చరిస్తూ..తాను వస్తున్నాను..మీ సంగతి తేలుస్తానని, మీకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఎందుకని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలు ఇవాళ నిరసన తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలను ఉన్మాదులు అంటున్నారు. అసలు ఉన్మాది చంద్రబాబు కదా?. పోలీసులతో ఇలాగేనా వ్యవహరించేది. మూడుసార్లు సీఎంగా చేసిన వ్యక్తి పోలీసులతో ఎలా వ్యవహరించాలో ఆయనకు తెలియదా? ఏంటీ..ఈ అరాచకం. నీ పార్టీ రౌడీలను, గుండాలను పెట్టుకొని అక్కడ అల్లర్లు సృష్టించి, శాంతిభద్రతలకు విఘాతం కల్గించడమేనా నీ ధ్యేయం. ఎవరైనా ఒక శుభకార్యానికి వెళ్తే..ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను అంచనా వేసి మాట్లాడాలి. కానీ చంద్రబాబు ఏం చేస్తున్నారు. ఆయన సామాజిక వర్గం కోసం ఎదుటి వారిని దూషించడం సరికాదు.ఎంతసేపు ఒకే ఆలోచన దుక్ఫధంతో ముందుకువెళ్తున్నారు. ఇవాళ విశాఖకు ఉన్న ప్రాముఖ్యత, ఇంకో ఐదేళ్లలో ఈ దేశ చిత్రపటంలోనే విశాఖ చేరబోతోంది. విశాఖను అభివృద్ధి చేసేందుకు మా ముఖ్యమంత్రి   నిర్ణయాలు తీసుకుంటుంటే..ఇలాంటివి జరుగకూడదు..వాటికి ఆటంకాలు కల్పించాలనే దురుద్దేశంతో ఇవాళ నీచ రాజకీయాలు చేస్తున్నారు. 
చంద్రబాబు నీకు తెలియదా..విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు అని గర్జించి సాధించుకున్న ప్రాంతం అది. ఆంధ్రుల హక్కులను తెలియజెప్పిన పరిస్థితులను ఆ రోజు చూశాం. ఉద్యమాలకు మెట్టినిల్లు ఆ ప్రాంతం. ఎంత శాంతియుతంగా ఉంటారో.. హక్కుల కోసం కూడా ఆ ప్రాంతం అంతగా పోరాడుతుంది. వారికి ఎవరు చెప్పక్కర్లేదు. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెట్టడానికి వీలు లేదన్న చంద్రబాబును విశాఖలో స్వాగతిస్తారా?..నీ తాలుకా నైజం మార్చుకునేంత కాలం ఇదే పరిస్థితి ఉంటుంది. ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు..రాయలసీమ, కోస్తాలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఇదే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబుకు ఆయన సామాజిక వర్గం తప్ప మరెవ్వరూ అక్కర్లేదు. చంద్రబాబుకు ఒక్కరికే రాజ్యాంగంలో ఒక చట్టం రూపొందించారా? అందరికీ చట్టం వర్తించదా? అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోవిధంగా మాట్లాడుతావా?. విశాఖకు వెళ్లే ముందు ఏం మాట్లాడావో గుర్తు లేదా? అమరావతి పరిరక్షణకు ఉద్యమిస్తామని మాట్లాడింది నీవు కాదా?. ఇవాళ తగదమ్మా అంటూ విశాఖ వెళ్తే ఎందుకు స్వాగతిస్తారు. పెందుర్తిలో భూకబ్జాలు చేశారంటున్నావు..2019 వరకు నీవే కదా ముఖ్యమంత్రివి. ఇలాంటి మాటలు మాట్లాడే ముందు సిగ్గు పడాలి. 2017లో ఈనాడులో బ్యానర్‌ స్టోరీ రాశారు. విశాఖ ప్రాంతంలో మాయమవుతున్న భూ రికార్డులు అంటూ కథనాలు రాసింది వాస్తవం కాదా? నీకు అప్పుడు కనిపించలేదా?. లక్ష ఎకరాలు కబ్జా అయ్యిందని ఈనాడులో రాసింది వాస్తవం కాదా? నీవా భూకబ్జాల గురించి మాట్లాడేది. పేదలకు ఇళ్లు ఇస్తుంటే ఓర్వలేక చంద్రబాబు ఇవాళ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నీ మాదిరిగా అక్కడ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేయలేదే?. ఉత్తరాంధ్ర ప్రజలు సంయమనంగా ఉండాలని బొత్స సత్యనారాయణ కోరారు.

Back to Top