బాబు రాజకీయ ఎదుగుదలకు వైయస్‌ఆరే కారణం

రైతులకు ఇవ్వాల్సింది గాజులు కాదు.. లాక్కున్న భూములు

రాజధాని రైతులు చంద్రబాబు ఉచ్చులో పడకండీ

రెండు కమిటీల నివేదికలు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాం

బాబు హైటెక్‌ సిటీతో రియలెస్టేట్‌ వ్యాపారం చేశాడని అమెరికా అమ్మాయి చెప్పింది

పోలీసులను దుర్భాషలాడడం నీ 40 ఏళ్ల అనుభవమా..?

పవన్‌ కల్యాణ్‌ లాంటి తాత్కాలిక మనుషులతో ఉపయోగం ఉండదు

మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం: చంద్రబాబు రాజకీయ ఎదుగుదలకు మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కారణం అని, రాజధాని రైతులకు బాబు కుటుంబం ఇవ్వాల్సింది గాజులు కాదు.. లాక్కున్న భూములు అని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు రాజకీయ చరిత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసు అని, ఐదేళ్ల పాలనలో ప్రజల అవసరాలను మరిచి మళ్లీ పెద్ద డ్రామాకు తెరతీశాడని మండిపడ్డారు. అమరావతిలో అసెంబ్లీ, విశాఖలో సచివాలయం పెట్టాలని నిపుణుల కమిటీ సూచించిందని, విశాఖను రాజధానిగా చేస్తే ముంబై స్థాయిలో అభివృద్ధి చెందుతుందని నిపుణుల కమిటీ చెప్పిందన్నారు. రెండు కమిటీలు ఇచ్చిన నివేదికలను పరిశీలించి ఫైనల్‌గా ఒక నిర్ణయానికి వస్తామన్నారు. అమరావతి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్ణయం ఉంటుందని, దయచేసి చంద్రబాబు ఉచ్చులో పడి మోసపోవద్దని, రాజధాని రైతులను సమయమనం పాటించాలని కోరారు.

విశాఖపట్నం వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లారంటే.. ‘చంద్రబాబు రాజకీయ ఎదుగుదలకు మహానేత వైయస్‌ఆరే కారణం. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబుకు వైయస్‌ఆర్‌ అన్ని రకాలుగా మేలు చేశారు. కాంగ్రెస్‌లో చంద్రబాబు మంత్రి అవ్వడానికి కూడా వైయస్‌ఆరే కారణం. బాబును చూసి వైయస్‌ఆర్‌ భయపడాల్సిన అవసరం ఏముంది..? చంద్రబాబు వికృతమైన ఆకారాన్ని చూసి జనం భయపడ్డారేమో..? ఎందుకు ఢాంబికాలు మాట్లాడుతావు.. దీని వల్ల ఏమిటీ ఉపయోగం.

రైతులకు ఇవాళ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.. ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి.. కావాల్సిన అవసరాలను, పరిస్థితులను, అభివృద్ధి అంశాలను దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేసి ఉంటే ఇవాళ రాష్ట్రానికి ఈ పరిస్థితులు, ఇబ్బందులు ఉండేవి కాదు. ఆర్థికలోటు, అప్పుల పాలు చంద్రబాబు తెచ్చినవే. ఐదు సంవత్సరాల పాలనలో ఇంకో 25 సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్లారు. రాష్ట్రాన్ని సుమారు రూ.1.95 లక్షల కోట్ల అప్పుల పాలు చేశారు. ఎక్కడా కూడా ఫైనాన్షియల్‌ డిసిప్లేన్‌ లేకుండా ఎఫ్‌ఆర్‌బీఎంను క్రాస్‌ చేశారు. దీంతో ఇవాళ ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం నిపుణుల కమిటీని విభజన సమయంలో వేసింది. రాష్ట్ర స్థితిగతులు, ప్రజల అభిప్రాయాల మేరకు శివరామకృష్ణన్‌ కమిటీ కొన్ని సూచనలు చేసింది. విభజన జరగడానికి కారణం.. పొలిట్‌బ్యూరో తీర్మానం చేసి అందరికంటే ముందు విభజనకు మద్దతు ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పింది ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా..? 2009 డిసెంబర్‌ 7న కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేస్తే హోంమంత్రి అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యకు ఫోన్‌ చేసి అఖిలపక్ష సమావేశం పెట్టి పార్టీల నిర్ణయాలను పంపించండి అన్నారు. ఆ సమావేశంలో నేను కూడా పాల్గొన్నా.. ఫస్ట్‌ మైక్‌ తీసుకొని మాట్లాడింది.. టీడీపీ తరుఫున అశోక్‌ గజపతిరాజు. టీడీపీ తరుఫున ఆ మీటింగ్‌కు నలుగురు పాల్గొన్నారు. నాగం జనార్దన్‌రెడ్డి, ముద్దు కృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు వచ్చారు. ఆ మీటింగ్‌లో ప్రజారాజ్యం తరుఫున చిరంజీవి కూడా పాల్గొన్నారు.

కేంద్ర నుంచి లేఖ వచ్చింది. అఖిలపక్షం సమావేశం పెట్టి అభిప్రాయాలు పంపించండి అని చెప్పారని రోశయ్య వివరించారు. ఆ సమయంలో అసెంబ్లీ కూడా జరుగుతుంది. ఫస్ట్‌ అశోక్‌ గజపతి రాజు మైక్‌ తీసుకొని పొలిట్‌బ్యూరో నిర్ణయం తీసుకున్నాం.. రాష్ట్ర విభజనకు టీడీపీ సానుకూలం, అసెంబ్లీలో తీర్మానం పెట్టండి మద్దతు ఇస్తామని చెప్పారు. ఆ రోజుల్లో వైయస్‌ఆర్‌ సీపీ పుట్టలేదు. ఇది వాస్తవం.. చరిత్ర చెరపలేరు. ముద్దుకృష్ణమనాయుడు చనిపోయి ఉండొచ్చు. మిగిలిన వారు బతికే ఉన్నారు కదా..? విభజన జరిగిన తరువాత నేను సీనియర్‌ను, అనుభవం ఉంది.. పుట్టిన బిడ్డను పెంచి పోషిస్తానని చెప్పాడు. ఏం పోషించావు.. ఒక టౌన్‌షిప్‌ కడితే రాష్ట్రానికి వెల్త్‌ క్రియేట్‌ అవుతుందంట. టౌన్‌షిప్‌ కడితే రియలెస్టేట్‌ వ్యాపారం క్రియేట్‌ అవుతుంది. పక్కనున్న భూములకు ధరలు పెరుగుతాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలకు, అన్ని ప్రాంతాలకు ఎలా వెల్త్‌ క్రియేట్‌ అవుతుంది.

హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ రాకముందే ఒక డీఆర్‌డీఏ, బీహెచ్‌ఈఎల్, పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి వెల్త్‌ క్రియేట్‌ అయ్యింది. ఎందుకు ప్రజలు ఇలా మోసం చేస్తున్నావు. టౌన్‌షిప్‌ కడతానని చెప్పావు.. సినిమా డైరెక్టర్‌ను తీసుకొచ్చి గ్రాఫిక్స్‌ చూపించావు. పోని అది చేయించావా..? రూ.840 కోట్లు కన్సల్టెంట్లకు ఎంఓయూలపై సంతకాలు పెట్టించారు. రూ.342 కోట్ల ప్రజాధనాన్ని కన్సల్టెంట్లకు ఇచ్చారు. అంటే ఎంత పని అవ్వాలి. పైపెచ్చు ఖర్చు అయ్యింది రూ.546 కోట్లు. కన్సల్టెంట్లకు ఇంత డబ్బు ఇస్తే ఏమనుకుంటున్నారు.. దోపిడీ తప్ప మరో కార్యక్రమం ఉందా..? ఇవాళ ఇంచు కూడా కదలనివ్వం అని మాట్లాడుతున్నాడు.

ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో అస్తవ్యవస్తమైన పాలన కనిపించింది. దోపిడీ కోసం చేసిన పాలన చేసినట్లుగా ఉంది. ఆర్థిక విధానం లోపభూయిష్టంగా ఉందని, అన్నింటినీ గాడిలో పెట్టేందుకు నిర్ణయాలు తీసుకున్నాం.  ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధిలో భాగంగా నిపుణుల కమిటీ వేశాం. ఆ కమిటీ అసెంబ్లీ అమరావతిలో, సెక్రటేరియట్‌ ఇంకో ప్రాంతానికి తరలించండి.. అది కూడా విశాఖలో పెడితే బాగుంటుంది.. దేశంలో పది పట్టణాలు ఉన్నాయి.. వాటిల్లో విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. రూ. 5 నుంచి 10 వేల కోట్లు పెట్టుబడి పెడితే హైదరాబాద్‌ను మించిన నగరంగా తయారవుతుందని కమిటీ రిపోర్టులో చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు ఆవేదన చెందుతున్నారు. జాతీయ ఉద్యమాల్లా గాజులు ఇస్తున్నారు. గాజులు కాదు.. తీసుకున్న భూములు ఇవ్వండి. కులం ముద్ర ఎందుకు వచ్చింది.. మీరు చెబుతున్న సామాజిక వర్గం విశాఖలో లేదా..? వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా.. ఇక్కడ రాజధాని వస్తే రిచ్చెస్టు అయ్యేది నీ సామాజిక వర్గమే చంద్రబాబూ.. ఇది వాస్తవం. ఎందుకు చంద్రబాబు కులాల గురించి పనికిమాలిన మాట్లాడుతావు..? ఎవరైతే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేసి, చిన్న, సన్నకారు రైతుల దగ్గర నుంచి రాజధాని విషయం తెలిసి.. చౌకగా దోచేశారనేది ఆరోపణ కాదు.. వాస్తవం.

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన అసెంబ్లీలో పేర్లతో సహా చెప్పారు. దాంట్లో అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు కదా.. ఎందుకు నోరు మెదపలేదు. రాజధాని ప్రకటన రాకముందు కొనుగోలు చేశారా.. లేదా..? ఇవాళ విశాఖ ప్రతిపాదనలో ఉంది.. రేపటి నుంచి ఎవరైనా కొనుగోలు చేస్తే దానికి అభ్యంతరం ఉండదు. రెండు నెలల ముందు నా లాంటి వాళ్లు ఎవరైనా కొనుగోలు చేస్తే అది తప్పు. ప్రత్యక్షంగా సందర్భం లేకుండా కొనుగోలు చేస్తే తప్పు. రాజధాని ప్రకటన ముందుకు నీ మంత్రులు, తాబేదారులకు లీకులు ఇచ్చి భూములు కొనుగోలు చేయించి తప్పు చేశావు.. కాదని చెప్పమనండి. హెరిటేజ్‌ ఎందుకు భూములు కొనుగోలు చేసింది. రాజధాని ప్రకటన రాకముందు కొనుగోలు చేస్తే దాన్ని ఏమనుకోవాలి.

ప్రజలతో ఎన్నుకోబడి వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు.. నీ పరిధిలో ఉండు. ఎందుకు అంత అహంకారం. గతంలో నన్ను టోల్‌గేట్‌ దగ్గర ఆపేసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. లాండ్‌ ఆర్డర్‌ పేరుతో ఆపేశారు.. దాన్ని అంగీకరించాం. చంద్రబాబులా పోలీస్‌ యంత్రాంగాన్ని దుర్భాషలాడామా..? అనుభవం అని చెప్పుకునేది దుర్భాషలాడడమా..? రోజు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు.

హైటెక్‌ సిటీ వద్ద ఎకరం రూ. కోటికి కొనుగోలు చేసి తరువాత వచ్చి రూ.30 కోట్లకు అమ్మారని అంటున్నాడు. సోషల్‌ మీడియాలో ఒక క్లిప్పింగ్‌ చూశాను.. అమెరికా నుంచి రీసెర్చ్‌ కోసం వచ్చిన అమ్మాయి హైటెక్‌ సిటీ పెట్టి భూములు రేట్లు పెంచుకోవడానికి చేశాడని, దీని వెనుక చంద్రబాబు బ్యాక్‌రౌండ్‌ ఇదని ఆ అమ్మాయి చెప్పింది. నువ్వు చేసే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఇదే. ప్రకటించిన తరువాత ఏం చేసినా ఏం కాదు.. ప్రకటించకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడం, రాజ్యాంగబద్ధంగా నువ్వు చేసింది దోపిడీ విధానం అని చెబుతున్నాం.

దేశం అంతటికి ఒక ఇండస్ట్రియల్‌ పాలసీ ఉంది. ఏ కార్పొరేషన్‌ అయినా నష్టాల్లో ఉంటే కేంద్రం, రాష్ట్రాలు ఆ పాలసీ ప్రకారం ముందుకు వెళ్తాయి. అందులో కొంత బయటకు అమ్మడం, లేదంటే ఆ కార్పొరేషన్‌ మూసివేయడం, ఎంప్లయీస్‌కు వీఆర్‌ఎస్‌ ఇవ్వడం, లేకపోతే ఒక ప్యాకేజీ ఇవ్వడం జరుగుతుంది. కానీ, ఆంధ్రరాష్ట్రంలో అలా జరగలేదు. 51 వేల మంది ఆర్టీసీ కార్మికులకు సంవత్సరానికి రూ.3600 కోట్ల జీతాల బకాయిలు చెల్లిస్తూ కార్పొరేషన్‌ మూసేస్తామనే పదం లేకుండా ప్రభుత్వంలో కలిపారు. దీంతోపాటు ప్రజారవాణా సంస్థ అందుబాటులోకి తీసుకురావాలని, నష్టాల్లో ఉంటే ప్రభుత్వమే భరించాలని విద్య, ఆరోగ్యాన్ని బాధ్యతగా ఏవిధంగా తీసుకున్నామో.. అలాగే ప్రజారవాణా కూడా బాధ్యతగా తీసుకుంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నాయకత్వంలో తొలిసారిగా జరిగిందని దేశం మొత్తం చెప్పకతప్పడు. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుంది.

ఎంతసేపు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు.. మీ ఇంటికి వస్తే ఏం ఇస్తావు అనే వ్యక్తికి ఏం ఉంటుంది. అహంకారాలు మాని వైయస్‌ జగన్‌ను చూసి నేర్చుకో చంద్రబాబూ. ప్రభుత్వానికి కొన్ని విధానాలు, ఆలోచనలు ఉంటాయి.. ఆ ప్రకారం ముందుకెళ్తాయని మీడియా ద్వారా చంద్రబాబు, ఆ పార్టీకి చెబుతున్నాను. రైతులు చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు హైపవర్‌ కమిటీ మీటింగ్‌ అయిన తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం వల్ల రాజధాని రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చంద్రబాబు డిక్టెట్‌ చేస్తున్నారు.. ఇది ఎక్కడా చూడని విడ్డూరం. ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిపోయినా పర్వాలేదు.. మరే ప్రాంతం అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు అనేది చంద్రబాబు సిద్ధాంతం. ఈ ఆలోచన సరైంది కాదని నా అభిప్రాయం. రైతులను రిక్వెస్ట్‌ చేస్తున్నాను మీపై సానుభూతి ఉంది. చంద్రబాబు పార్టీ ఇవాళ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేసింది. చంద్రబాబు లాబీలోకి పోవద్దు.

ఇంకో యాక్టర్‌ పవన్‌ కల్యాణ్‌ ఎన్నికలప్పుడు ఒక మాట, మర్నాడు ఒక మాట, ఇవాళ ఒకటి, రేపొకమాట మాట్లాడుతాడు. ఎప్పుడు మిడిల్‌ డ్రాప్‌ అవుతాడో తెలియదు. చంద్రబాబు ఏ స్క్రిప్టు ఇస్తే అది పట్టుకొని బయల్దేరి టపాటపా మాట్లాడి మళ్లీ 20 రోజులు షూటింగ్‌ చూసుకొని మళ్లీ వస్తాడు. ఇలాంటి తాత్కాలికమైన మనుషులతో ఉపశమనం పొందలేదు. సమయమనం పాటించాలని కోరుతున్నాను’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

 

Back to Top