రాష్ట్ర సమగ్రాభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం

మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
 

అసెంబ్లీ: రాష్ట్ర సమాగ్రాభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం. ఈ నేపథ్యంలో సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచనలు చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక కమిటీ వేశాం.. అందులో రాజధాని అంశం కూడా ఉంది. కమిటీ నివేదిక ఇవ్వగానే పరిశీలన చేస్తాం. అభివృద్ధిని రాష్ట్ర నలుమూలలా విస్తరింపజేస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అసెంబ్లీలో ఆయన ఏం మాట్లారంటే..

‘అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్‌ పెట్టి సుమారు 38 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. గత ప్రభుత్వం వారికి డెవలప్‌ చేసి ప్లాట్లు కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. వాళ్లందరికీ చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. క్యాపిటల్‌ ఎక్స్‌పెంచర్‌ రూ.5400 కోట్లు అని ఆర్థిక మంత్రి చెప్పారు. దాంట్లో నాలుగు భవనాలు మాత్రమే నిర్మించారు. సీఎం వైయస్‌ జగన్‌ పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష జరిపినప్పుడు 55 శాతం పూర్తయిన ఎమ్మెల్యే క్వార్టర్స్, మరికొన్ని భవనాలను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. రెండు బిల్డింగులను ఇంత వరకు తాత్కాలిక భవనాలు చేశారు. అసెంబ్లీని 6 లక్షల ఎస్‌ఎఫ్‌టీతో నిర్మించారు. సుమారు రూ.640 కోట్లను ఖర్చు చేశారు. చదరపు అడుగుకు రూ.10 వేలు ఖర్చు చేశారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్ర అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పారు. ఆ నేపథ్యంలో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో నీటి అవసరం ఎంత ఉంది. వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను ఏరకంగా అభివృద్ధి చేయాలి.. ఆర్థికంగా ఏరకంగా ఆదుకోవాలని అనుకున్నప్పుడు వాటి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం చెప్పారు.

చంద్రబాబుకు ఐదు సంవత్సరాలు పాలించే అద్బుతమైన అవకాశం కల్పించారు. ఐదు సంవత్సరాల్లో సద్వినియోగం చేసుకోకుండా.. ఏ కార్యక్రమం చేపట్టకుండా.. అమరావతి.. ఇంకోటి అని మాటలు చెప్పారు తప్పితే శాశ్వత ప్రాతిపదిక ఏ కార్యక్రమం చేయలేదు.

2004లో మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్‌ కేబినెట్‌ మీటింగ్‌లో అందరం కూర్చున్నాం. మొదటిసారి మంత్రిని అయ్యాను. 45 నిమిషాల్లో మీటింగ్‌ కంప్లీట్‌ అయిపోయింది. అప్పుడు సీఎం వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక ప్రజంటేషన్‌ ఇచ్చారు. అది ఏంటంటే.. సమగ్రంగా రాష్ట్రంలో ఉన్న కరువు ప్రాంతాలు పులిచింతల, పోలవరం, తోటపల్లి ఇవన్నీ నిర్మిస్తే సుమారు కోటి ఎకరాలకు సాగునీరు అందుతుంది.. రాష్ట్రంలో కరువు ఉండదని చెప్పారు. చీఫ్‌ సెక్రటరీ మోహన్‌కంద ప్రజంటేషన్‌ ఇచ్చారు.. అప్పుడు ఒక మంత్రి లేచి మీరే కదా చీఫ్‌ సెక్రటరీగా ఉన్నారు.. ఈ సలహా గత ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేదని అడిగారు. అప్పుడు ఆయన ఒక్క మాట చెప్పారు.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు ఐదేళ్ల భగవంతుడు అవకాశం ఇస్తాడు. ప్రజలకు ఏ మంచి చేయాలి. ఏరకంగా అభివృద్ధి చేయాలనే అవకాశం మీది అని అప్పటి చీఫ్‌ సెక్రటరీ చెప్పారు. ఆ ప్రకారమే వైయస్‌ఆర్‌ ఆ నిర్ణయం తీసుకున్నారు. జలయజ్ఞం పెట్టారు.. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఇంకా ముందుకు వెళ్తున్న తరుణంలో వైయస్‌ఆర్‌ మననుంచి దూరమయ్యారు.

ఈ రోజు మన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెబుతున్న మాటలు విన్నాం. ఏ రకంగా రాయలసీమను, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని సీఎం చెప్పడాన్ని మనం విన్నాం. చంద్రబాబుకు ఇలాంటి ఆలోచనలు లేవు. ఏదో కార్యక్రమం పెట్టి ఏరకంగా దోచుకోవాలి.. నా వాళ్లు, నేను బాగుపడాలనే ఆలోచన తప్ప, సమగ్రమైన ఆలోచన, అభివృద్ధి చేసే తపన చంద్రబాబు లేదు. ఇది చాలా దురదృష్టకరం. భగవంతుడు ఆశీర్వదించి వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేశారు. శివరామకృష్ణ కమిటీ కేంద్రం ఎందుకు వేసింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని లేకుండా పోయింది.. హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్లిపోయిందని కమిటీ వేసింది. కమిటీ వేస్తూ ఏం చెప్పిందంటే ఈ కమిటీ తాలూకా రిపోర్టు ఫైనల్‌ కాదు.. వచ్చే ప్రభుత్వాలు ఆలోచన చేస్తే.. ఇది దిక్సూచిగా ఉంటుందని చెప్పారు. దాన్ని కూడా టీడీపీ అంగీకరించకుండా ఈ కార్యక్రమం చేశారు.

సీఎం వైయస్‌ జగన్‌ ఒక కమిటీ వేశారు. పార్లమెంట్‌లో శివరామకృష్ణ కమిటీ వేసిందో.. అందులో ప్రధానంగా ఉన్న కేటీ రవీంద్ర (రిటైర్డ్‌ డీన్,  ప్రొఫెసర్, అర్బన్‌ డిజైన్‌ ఎట్‌ స్కూల్‌ అండ్‌ ప్లానింగ్‌ ఆర్కిటెక్‌ న్యూఢిల్లీ హెచ్‌ఓడీ )ను మెయిన్‌గా పెట్టారు. ప్రొఫెసర్‌ డాక్టర్‌ మహవీర్‌ (ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ డీన్, అకాడమిక్‌ స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్‌ న్యూఢిల్లీ), హెచ్‌ఎం శివానందస్వామి (ఫ్యాకల్టీ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ డైరెక్టర్‌ సెంట్రల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ అర్బన్‌ ట్రాన్స్‌ఫర్‌ సీఈపీటీ అహ్మదాబాద్‌), డాక్టర్‌ అంజలి మోహన్‌ (అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానర్‌ ఐఎన్‌డీఈ బెంగళూరు), కేపీ అరుణాచలం (రిటైర్డ్‌ చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ చెన్నై) వీరిలో ఒక్కరే మన ఆంధ్రరాష్ట్రానికి చెందిన వారు మిగిలిన వారి అర్బన్‌ డెవలప్‌మెంట్‌లో నిపుణులు. వీరు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన నివేదిక ఇస్తారు. ఇంతకు ముందు వచ్చినట్లుగా ప్రాంతీయ విభేధాలు రాకుండా అందరి ఆమోదం ఉండేందుకు సీఎం ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ కమిటీ వేశారు. అందరికీ ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ఈ ప్రభుత్వ ధ్యేయం. కమిటీ నివేదిక వచ్చిన తరువాత ఆలోచన చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

 

తాజా ఫోటోలు

Back to Top