వైయస్‌ జగన్‌ పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది

రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు

చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు

పల్నాడులో అల్లర్లు సృష్టించాలని బాబు గణం కుట్రలు చేస్తోంది

మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని పురపాలన శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. కొన్ని పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయని తీవ్రంగా ఖండించారు. వంద రోజుల వైయస్‌ జగన్‌ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. చిన్న చిన్న తగాదాలను భూతద్దంలో చూపించేప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షంపై ఫైర్‌ అయ్యారు. వాళ్లు చెప్పినదాని కంటే ఎక్కువగా కొన్ని పత్రికలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో ఎన్నో అరాచకాలు జరిగాయన్నారు. నాడు ఎమ్మెల్యేలుగా ఉన్న కోడెల శివప్రసాదరావు అరాచకాలు మనం చూశామన్నారు. ప్రత్యక్షంగా తానే రెండు సందర్భాల్లో చూశానని చెప్పారు. తనను టోల్‌గేట్‌ వద్ద ఆపి, ఆ తరువాత ఊరూరు తిప్పి పోలీసుస్టేషన్‌లో ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ రోజు ఏమీ లేవన్నారు. ఒక ఊర్లో గొడవలు జరిగి పది కుటుంబాలు ఘర్షణపడితే పోలీసులు శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం శాంతియుతంగా పని చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. చంద్రబాబు ఉక్రోశంతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2014 తరువాత చంద్రబాబు , 2019లో వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక కలెక్టర్లతో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే..చాలా వ్యత్యాసం ఉందన్నారు. ప్రజలకు మనం సేవలకులమని వైయస్‌ జగన్‌ చెబితే..చంద్రబాబు చట్టాలను చుట్టాలుగా మార్చుకొని, తన పార్టీ నేతలకు మేలు చేసేలా వ్యవస్థలను వాడుకున్నారన్నారు. పేకాట క్లబ్‌లు, సంఘ విద్రోహ శక్తులను ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని వైయస్‌ జగన్‌ సూచించారన్నారు. ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వమన్నారే తప్ప..చట్టానికి వ్యతిరేకంగా పని చేయవద్దని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. సీఎం ఆలోచన బట్టే రాష్ట్రంలో పరిపాలన సాగుతుందన్నారు. ఆ రోజు చంద్రబాబు దోపిడీ అనే విధానాన్ని ఎంచుకొని నియంతలా పరిపాలించారని గుర్తు చేశారు. వైయస్‌ జగన్‌ మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని అధికారులకు సూచించారని వివరించారు. ఎవరి పరిపాలన ఎంటో? ఎవరి విధానం ఏంటో తేటతెల్లమైందన్నారు. చంద్రబాబు , వైయస్‌ జగన్‌ ఉపన్యాసాలను ఒక్కసారి గమనించాలన్నారు. ఈ మూడు నెలల్లో వైయస్‌ జగన్‌ సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. మేనిఫెస్టోకు అనుగుణంగా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. భగవంతుడు కూడా కరుణించాడన్నారు. వర్షాపాతం తక్కువైనా..ఎగువ నుంచి వరద నీరు రావడంతో జలాశయాలు నిండాయన్నారు. ఎక్కడా కూడా పబ్లిసిటికి తావులేకుండా పనులు చేస్తున్నామన్నారు. ఇంత శాంతియుతంగా రాష్ట్రం ఉంటే చంద్రబాబు ఓర్వలేక, రాక్షస తాలుకా ఆలోచనతో చంద్రబాబు, ఆయన అనుచర గణం అల్లరి సృష్టించేందుకు చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునిచ్చారన్నారు. చంద్రబాబు జిమ్మిక్కులు ఆపాలని సూచించారు. ఇదేనా మీ నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అని ప్రశ్నించారు. మీ తాలుకా పప్పులు ఉడకవన్నారు. పాత ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని, వైయస్‌ జగన్‌ కొత్త ఆలోచనలతో పాలన సాగిస్తున్నారన్నారు. చంద్రబాబు పాత ఆలోచనలు పోయాయన్నారు. మా ప్రభుత్వం ఒక సద్దుదేశ్యంతో ముందుకు వెళ్తుందని, చంద్రబాబు లాంటి కుటిల మనస్తత్వంతో చేస్తున్న రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. మైనింగ్‌ మాఫియాకు పాల్పడిన యరపతినేని, పోర్జరీ కేసులో చిక్కిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రభాకర్‌రావుఫ్యాబ్రికేషన్‌ కేసు, కూన రవి దౌర్జన్యం వేరే ఎవరు చేయలేదన్నారు. అచ్చెన్నాయుడు అహంకారంతో వ్యవహరించారని, దళితులపై నన్నపనేని రాజకుమారి చేసిన వ్యాఖ్యలు బాధేస్తున్నాయన్నారు. చట్టాలకు లోబడే వ్యక్తులం కాబట్టి మీరు చేసిన అన్ని దుశ్చర్యలను తట్టుకొని ఇవాళ అధికారంలోకి వచ్చామన్నారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి వరకు టీడీపీ నేతలు చేసిన ఆకృత్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

పెయిడ్‌ ఆర్టిస్టులతో గందరగోళం
కొద్దిరోజుల్లోనే లక్షా 34 వేల మంది గ్రామ కార్యదర్శులు విధుల్లో చేరబోతున్నారని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు వాలంటీర్ల నియామకం చేపట్టినట్లు తెలిపారు. ప్రతిపక్షం పెయిడ్‌ ఆర్టిస్టులతో గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు.  అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ పేపర్‌ లేదన్న విషయాన్ని గత ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించానని చెప్పారు. బాలకృష్ణ వియ్యంకుడు మరునాడు వచ్చి స్టేట్‌మెంట్‌ ఇచ్చారని, అది తప్పు అని వెంటనే చెప్పినట్లు తెలిపారు.  

 

 

Back to Top