వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమం

మహానేతకు నివాళులర్పించిన మంత్రి బొత్స సత్యనారాయణ
 

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహానేత వైయస్‌ఆర్‌ పాలనను ఆయన గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ ఆశయాలను సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నెరవేర్చుతున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని తెలుగు ప్రజల మదిలో ఉన్న ఏకైక వ్యక్తి మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్నారు. ఎంతో దూరదృష్టితో వైయస్‌ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ప్రజలకు అన్ని విధాల మేలు చేసిన ముఖ్యమంత్రి అని కొనియాడారు. 

హైదరాబాద్‌లో..
మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో నిర్వహించారు. వైయస్‌ఆర్‌ విగ్రహానికి ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ నేతలు పాల్గొని మహానేతకు శ్రద్ధాంజలి ఘటించారు.

గణేష్‌ చతుర్ధి పూజల్లో మంత్రి బొత్స 
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేష్‌ చతుర్ధి పూజా కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.

Back to Top