ఒక్కో అన్న క్యాంటీన్‌ ఏర్పాటులో రూ.50 లక్షల దోపిడీ 

మంత్రి బొత్స సత్యనారాయణ

మూతపడిన క్యాంటీన్లను వచ్చే నెలలో తెరుస్తాం

పేదలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేస్తాం

అమరావతి:  టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కో అన్న క్యాంటీన్‌ ఏర్పాటుకు రూ.50 లక్షలు దోచేశారని ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ క్యాంటీన్ల ఏర్పాటులో భారీగా అవినీతి చోటుచేసుకుందని విమర్శించారు. మూతపడిన అన్న క్యాంటీన్లను వచ్చే నెల మొదటివారంలో తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. త్వరలో ప్రారంభించే అన్న క్యాంటీన్లు ఆసుపత్రులకు సమీపంలో పేదలకు ఉపయోగపడేవిధంగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 
 
 
 

Back to Top