పేదవాడి కడుపుకొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు

మంత్రి బొత్స సత్యనారాయణ
 

అమరావతి: పేదవాడి కడుపుకొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో అన్న క్యాంటీన్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. చాలా చోట్ల ఎన్నికల ముందు హడావుడిగా అన్నా క్యాంటీన్లు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్లు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు. ఎక్కడా కూడా అన్నా క్యాంటీన్లు మూసి వేయలేదని వివరించారు. ఎక్కడెక్కడ అన్నా క్యాంటీన్లు ఉండాలనే దానిపై ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పారు. 
 

Back to Top