అభివృద్ధి..సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

బొత్స సత్యనారాయణ
 

అమరావతి: అభివృద్ధి..ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో రాజధానిపై జరిగిన చర్చలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. గతంలో రాజధాని పేరుతో ఎలాంటి నిర్మాణాలు జరిగాయో చూశామన్నారు. మాటలు కోటలు దాటాయి..చేతలు గడప దాటలేదు. ఇవాళ మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆ దిశగా పని చేస్తున్నామన్నారు. ఒక్కసారిగా రూ.500 కోట్లు కేటాయించామన్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రూ.1100 కోట్లు ఇస్తే మా ప్రభుత్వం ఒక్క ఏడాదే రూ. 500 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు.
 

తాజా ఫోటోలు

Back to Top