టీడీపీకి దూర దృష్టి లేకపోవడమే నీటి సమస్య

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 
 

అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం దూర దృష్టితో ఆలోచించకపోవడమే విశాఖలో  నీటి సమస్యకు కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధితో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారన్నారు.  ప్రతిపక్షం సమన్వయం పాటించి వాస్తవాలు మాట్లాడాలని కోరారు. ఏవిధంగా విశాఖకు నీటిని తేవాలనే ఆలోచన చేసి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. గత ఐదు సంవత్సరాల్లో ఒక రోజు కూడా టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షానికి సలహాలు,సూచనలు ఇవ్వాలని కోరిన పాపాన కూడా ఎప్పడూ పోలేదన్నారు. 

Back to Top