మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బొత్స

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో 2వ బ్లాక్‌లో కేటాయించిన ఛాంబర్‌లో మంత్రి బొత్స ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్న మంత్రి బొత్స బాధ్యతలు స్వీకరిస్తూ ఫైల్‌పై సంతకం చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని, ఈ ప్రభుత్వం నాది అని పేదలు భావించే రీతిలో పాలన ఉండబోతోందని అన్నారు. ‘చెప్పింది చేస్తాం...చేసేదే చెప్తాం..’ ఇదే జగన్‌ సర్కార్‌ విధామని బొత్స తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచామని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు గృహ వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు పక్కా గృహ నిర్మాణాలు...ఇళ్ల స్థలాలను మంజూరు చేస‍్తామని, పట్టణ ప్రాంతాల్లో అనాదిగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. విభజన తర్వాత పసికందు లాంటి ఏపీని చంద్రబాబు చిక్కిశల్యం అయ్యేలా చేశారని ఆయన మండిపడ్డారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top