మా ప్రభుత్వం ప్రజలకు ఆసరాగా ఉంటుంది

మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రతి ఇంటికి వైయస్‌ జగన్‌ కుటుంట పెద్దగా ఉంటారు

అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తాం

అమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఆసరాగా ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గవర్నర్‌ ప్రసంగం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టో ఓ పవిత్రమైన బైబిల్, ఖురాన్, భగవత్గీత వంటిదని మా నాయకుడు చెప్పారని, అవినీతిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందులో భాగంగానే జ్యూడిషియల్‌ కమిషన్‌ వేసి దేశంలోనే ఆదర్శంగా ఉండాలన్నదే వైయస్‌ జగన్‌ ఉద్దేశం. సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాలను రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా అందజేస్తాం. ఇంతకు ముందులా కాకుండా మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏవిధమైన భరోసా ఉండేదో అలాంటి భరోసాను మా ప్రభుత్వం కల్పిస్తుంది. పేదలందరికీ కార్పొరేట్‌ వైద్యం అందిస్తాం. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు రూ.10 వేలు పింఛన్లు పెంచుతున్నాం.  మీ కుటుంబ పెద్దగా వైయస్‌ జగన్‌ ఉంటారు. మీ పిల్లలు పెద్ద చదువులు చదివించే బాధ్యత వైయస్‌ జగన్‌ తీసుకుంటారు. గవర్నర్‌ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని, నిర్ణయాన్ని చెప్పారు. గవర్నర్‌ చెప్పింది తూచ తప్పకుండా నెరవేర్చుతాం. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా విద్యను ప్రోత్సహిస్తాం. ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. నామినేటేడ్‌ పోస్టులన్నీ కూడా 50 శాతం బడుగు, బలహీన వర్గాలకు  ఇస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టారన్నారు. రైతులకు ప్రతి ఏటా రూ.12,500 వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద అందజేస్తామన్నారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తాం. ప్రకృతి వైఫరీత్యాల నిధి ఏర్పాటు చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో కూడా బోర్‌ వేసే యంత్రాన్ని, రిగ్గ్‌ను ఏర్పాటు చేస్తాం. రైతులకు పగలు 9 గంటల విద్యుత్‌  ఇస్తాం. రైతులందరూ హాయిగా వ్యవసాయం చేయవచ్చు. ఉద్యోగులందరికీ ఐఆర్‌ ఇవ్వడమే కాకుండా వారి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, వెలుగు సిబ్బందికి వేతనాలు పెంచుతాం. పారిశుద్ధ్య కార్మికులకు రూ.12 వేల నుంచి 18 వేలకు వేతనం పెంచాం. గవర్నర్‌ ప్రసంగంలో వైయస్‌ జగన్‌ ఆలోచనలు ఉన్నాయని, మాటిచ్చిన ప్రతిది నెరవేర్చుతాం. ప్రభుత్వం ప్రజలకు ఆసరాగా ఉంటుంది. ఇది మాప్రభుత్వం అనేలా పాలిస్తాం. 

 

Back to Top