సభా నాయకుడు స్పీకర్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చారు

మంత్రి బొత్స సత్యనారాయణ
 

అమరావతి: సభా నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పీకర్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. స్పీకర్‌ ధన్యవాద తీర్మానం సభలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని స్పీకర్‌గా ఎన్నిక చేయడం గొప్ప అదృష్టం. ఆరు సార్లు ఎమ్మెల్యే, మూడుసార్లు మంత్రిగా పని చేసిన వ్యక్తికి స్పీకర్‌గా అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉంది. గత సభలో నేను లేను కాని. టీవీల్లో సభలో జరుగుతున్న తీరును చూసి బాధగా ఉండేది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అనుసరించి తీరు రాజ్యాంగవిరుద్ధంగా ఉండేది. అధికార పార్టీకి చెందిన వ్యక్తికి స్పీకర్‌గా అవకాశం వస్తుంది. స్పీకర్‌ కనుసన్నలతో సభను మానిటరింగ్‌ చేస్తుంటారు. అలాంటి నేపథ్యం రాకుండా ఉండాలని మా సభా నాయకుడు మీకు పూర్తి స్వేచ్చను ఇచ్చారు. మీరు సభా విలువలతో ముందుకు వెళ్తారని నమ్ముతున్నాను. గత 25 ఏళ్లు మీతో ఉన్న సన్నిహితంతో విజయవంతంగా సభ నడుపుతారని నమ్ముతున్నాను. మీ హయాంలో నా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని విశ్వాసం ఉంది. మిమ్మల్ని ఎన్నుకున్న మా సభానాయకుడు వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top