చంద్రబాబు బుద్ధి మారడం లేదు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటివద్దకే పింఛన్లు అందాయి

పింఛన్ల అమలుపై పారదర్శకతకు జనం ఆనందంగా ఉన్నారు

జన్మభూమి కమిటీల మాదిరిగా వసూలు దందా నడపలేదు

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్‌ ఇవ్వాలన్నదే మా విధానం

అర్హులైన పింఛన్‌దారులను తీసేశామని చంద్రబాబు ప్రేలాపణలు

మంత్రి బొత్స సత్యనారాయణ

ఏపీ సచివాలయం: ప్రతి దాన్ని నెగిటివ్‌గా ఆలోచించడం చంద్రబాబు మనస్తత్వమని, ప్రజలు ఆయన్ను చిత్తుగా ఓడించినా కూడా బుద్ధి మారడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అర్హుల పంఛన్లు తొలగించామని చంద్రబాబు ప్రేలాపణలు చేస్తున్నారని, ఆయన మాటలు ఎవరూ నమ్మొద్దని మంత్రి సూచించారు.  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 
రాష్ట్రంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఈ ప్రభుత్వం అర్హులందరికీ ఇంటి వద్దకే పింఛన్‌ అందజేశాం. అందరూ ఆనందంగా ఉన్నారు. మా ఇంటికి పింఛన్‌ తీసుకువచ్చారని, గతంలో మాదిరిగా జన్మభూమి కమిటీలకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేకుండా పోయిందని లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారు. పింఛన్ల పంపిణీపై మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. అర్హులుగా ఉండి పింఛన్‌ పొందకపోతే గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఐదు రోజులకే పింఛన్‌ మంజూరు చేస్తాం. ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదన్నదే ప్రభుత్వ విధానం. అర్హులందరికీ పింఛన్‌ ఇస్తాం. ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. 7 లక్షల పింఛన్లు తగ్గించామని ఆరోపిస్తున్నారు.ఈ మాటపై చంద్రబాబు నిలబడుతారా? రాజకీయాల్లో ఉండి ఇలా మాట్లాడటం సిగ్గు చేటు. స్వయాన చంద్రబాబు గ్రామమైన నారావారిపల్లిలో అర్హులు, అనర్హుల జాబితాను ప్రదర్శించాం. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చు అని సూచించాం. ఇంత పారదర్శకంగా పనిచేస్తుంటే ..చంద్రబాబు రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు బుద్ధి మారడం లేదు. అది పుట్టుకతో వచ్చింది కాబట్టే వాస్తవాలకు దూరంగా ఉంటారు. ప్రజల మనసు దోచుకోవాలనే ఆలోచన చంద్రబాబుకు ఉండదు. గత ప్రభుత్వం కంటే 2019లో ఇచ్చిన పింఛన్ల కంటే ఈ రోజు సుమారు రెండు లక్షల పింఛన్లు అధనంగా ఇచ్చాం. దాదాపుగా 6 లక్షల మందికి కొత్త పింఛన్లు  ఇచ్చాం. దీర్ఘకాలిక రోగులకు కూడా పింఛన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్‌ ఇవ్వాలన్నదే మా విధానం. ఈ ప్రభుత్వం అందరిది. వైయస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో వైయస్‌ జగన్‌ పాలన చేస్తున్నారు. ప్రజలకు మేలు చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. అర్హులకు అన్యాయం జరుగకూడదన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వం మాదిరిగా పార్టీలకు అనుగుణంగా పింఛన్లు ఇవ్వడం లేదు. సంతృప్తికరమైన పద్ధతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఎక్కడాలేని విధంగా ఐదు రోజుల్లో పింఛన్లు ఇస్తున్నాం. చంద్రబాబు మాటలు ఎవరూ కూడా నమ్మడం లేదు. అర్హులందరికీ భరోసా కల్పించేందుకు ఇవాళ ఇద్దరం మంత్రులం వచ్చి మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాటగా మీ అందరికీ చెబుతున్నాం. ఏ  ఒక్కరూ కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం.  

తాజా వీడియోలు

Back to Top