అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మంత్రి బొత్స సత్యనారాయణ

విజయనగరం: అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.  ఎన్నడూ లేని విధంగా మత్స్యకారులకు బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించామని తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని చెప్పారు.  ఇంగ్లీష్‌ మీడియం విద్య మన పిల్లలకు గొప్ప అవకాశం అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మా సమస్యగా స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.సచివాలయ ఉద్యోగాలను పారదర్శకంగా చేపట్టామని వివరించారు.

Read Also: గంగ‌పుత్రుల క‌న్నీళ్లు తుడ‌వాల‌ని పాద‌యాత్ర‌లోనే అనుకున్నా 

Back to Top