చంద్రబాబు ఇప్పటికైనా ఇల్లు ఖాళీ చేయాలి

నదీ పరివాహక ప్రాంతాన్ని అందరూ కాపాడుకోవాలి

మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి:  లింగమనేని రమేష్‌ గెస్ట్‌ హౌస్‌ కచ్చితంగా అక్రమ కట్టడమేనని, చంద్రబాబు ఇప్పటికైనా ఇల్లు ఖాళీ చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. నదీ పరివాహక ప్రాంతాన్ని అందరూ కాపాడుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. శాసన మండలిలో మంత్రి మాట్లాడుతూ..మనం చేసిన చట్టాలను మనమే అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రజావేదిక తొలగింపుపై అర్ధరాత్రి హడావుడిగా కోర్టుకెళ్లారన్నారు. కోర్టు కూడా అదిఅక్రమ కట్టడమేనని నిలదీసినట్లు చెప్పారు. చంద్రబాబు ఇల్లు ఖాళీ చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మేం ఎవరిపైనా కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదని తేల్చి చెప్పారు. చట్టప్రకారం నడుచుకుంటున్నామని పేర్కొన్నారు.
 

Back to Top