చంద్రబాబుకు పవన్ కల్యాణ్ బినామీ..   

అమరావతితో పాటు అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తాం

మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి:   టీడీపీ అధినేత చంద్రబాబుకు పవన్ కల్యాణ్ రాజకీయ బినామీ అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అందుకే టీడీపీ గొంతుకను పవన్ వినిపిస్తున్నారని విమర్శించారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగబోదని తెలిపారు. అమరావతి నిర్మాణానికి మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. అమరావతితో పాటు అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.  
రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తామని బొత్స చెప్పారు. వైయస్‌ జగన్‌ వంద రోజుల పాలనకు 100 మార్కులు పడ్డాయని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. అమరావతి నుంచి ప్రపంచ బ్యాంక్ తనంతట తానే వెనక్కి వెళ్లలేదని... రుణం వద్దని కేంద్ర ప్రభుత్వం సూచించడంతోనే తప్పుకుందని తెలిపారు. సంక్షేమ పథకాలకు సాయం చేసేందుకు వరల్డ్ బ్యాంక్ ఇప్పటికీ సిద్ధంగా ఉందని చెప్పారు. విశాఖ భూకుంభకోణంలో ఏ పార్టీవారు ఉన్నా వదిలిపెట్టబోమని... కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top