కుప్పం ఓటమితో బాబు రాజకీయ చరిత్ర ముగిసినట్టే..

విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి

ప్రకాశం: అధికారం కోసం చంద్రబాబు, టీడీపీ నేతలు పగటి కలలు కంటున్నారని, కుప్పం మున్సిపల్‌ ఎన్నికలో టీడీపీ ఓటమితో చంద్రబాబు రాజకీయ చరిత్ర ముగిసినట్టేనని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కుప్పంలో గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ ప్రలోభాల పర్వానికి దిగిందని, ఎన్ని కుయుక్తులు పన్నినా.. వైయస్‌ఆర్‌ సీపీ విజయం ఖామన్నారు. ప్రజలంతా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారన్నారు. అమరావతి రైతుల ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ పాదయాత్ర చేస్తోందన్నారు. దమ్ముంటే టీడీపీ జెండా పట్టుకొని ధైర్యంగా పాదయాత్ర చేయొచ్చు కదా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనకు ప్రజల పూర్తి మద్దతు ఉందన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top