ప్రకాశం జిల్లా గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు

ఐదేళ్లలో జిల్లాకు ఏం చేశారో చంద్రబాబు చెప్పగలడా..?

విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి

ఒంగోలు: ప్రకాశం జిల్లా అభివృద్ధిపై మాట్లాడే అర్హత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలకు లేదని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాయాల్సింది ముఖ్యమంత్రికి కాదు.. చంద్రబాబుకు రాయాలని సూచించారు. ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఉద్దేశపూర్వకంగానే ప్రకాశం జిల్లాను చంద్రబాబు నిర్లక్ష్యం చేశాడని మండిపడ్డారు. టీడీపీకి తక్కువ సీట్లు వచ్చాయని ప్రకాశం జిల్లాపై పక్షపాతం చూపించాడని, ఐదేళ్లు అధికారంలో ఉండి జిల్లాను ఏ మేరకు అభివృద్ధి చేశావని టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు లేఖ రాయాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారని గుర్తుచేశారు. ప్రకాశం జిల్లాకు ఏం చేశారో చంద్రబాబు చెప్పగలడా..? చంద్రబాబు ఒక్క ప్రాజెక్టు అయినా చేపట్టాడా..? అని ప్రశ్నించారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top