సీఎం నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి

కరోనా పాజిటివ్‌ కేసుల్లో ఢిల్లీ వెళ్లొచ్చినవారే అధికం

విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి

ఒంగోలు: కరోనా కష్టకాలంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చూస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ఒంగోలులో మంత్రి బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారందరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులన్ని ఢిల్లీ మర్కజ్‌కి వెళ్లి వచ్చిన వారేనని, ఇంకా ఎవరైనా ఉంటే స్వచ్ఛదంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అదేవిధంగా నిత్యావసర సరుకులు అధిక రేట్లకు అమ్ముతున్నట్లు తనకు ఫిర్యాదులు వచ్చాయని, అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎం వైయస్‌ జగన్‌ దూరదృష్టితో వలంటీర్ల వ్యవస్థ అమలు చేశారన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో వలంటీర్ల వ్యవస్థ కీలకంగా మారిందన్నారు. డాక్టర్లు, ఉద్యోగులు, మెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్‌ అధికారులు, ఉద్యోగులు అందరూ బాగా కష్టపడుతున్నారని వారి సేవలు అభినందనీయమన్నారు. 

Back to Top