చంద్రబాబు కుటుంబసభ్యులను ఎవ్వరూ కించపరుస్తూ మాట్లాడలేదు  

మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి
 

  ప్రకాశం: అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులను ఎవ్వరూ కించపరుస్తూ మాట్లాడలేదని మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి అన్నారు.  వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబు నాయుడు వైఎస్ కుటుంబ సభ్యులపై అనవసర వ్యాఖ్యలు చేశారని  అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..  అసెంబ్లీలో మంత్రులు మాధవ రెడ్డి, రంగా హత్యల గురించి చర్చించాలని అన్నారే తప్ప.. మరి ఏ ఇతర వ్యాఖ్యలు చేయలేదు.

భువనేశ్వరి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే మేము ఒప్పకోం.. భువనేశ్వరీ మాకు సోదరి లాంటిది. అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా మాట్లాడితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూస్తూ ఊరుకోడు. మహిళలపై తమకు అపారమైన గౌరవం ఉంది. వైఎస్ షర్మిల గురించి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడితే వాటిని చూసి టీడీపీ నేతలు నవ్వుకున్నారు. అసెంబ్లీలో జరిగింది అంతా ఒక డ్రామాలా ఉంది. కుప్పం మున్సిపల్ ఎన్నికల ఓటమితో చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నాడ'ని మంత్రి బాలినేని అన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top