ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడండి

సీఎంపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు

చంద్రబాబుకు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరిక

ప్రకాశం: సచివాలయానికి వెళ్లడానికి రోడ్లు కూడా వేయలేని చేతగానివాడు చంద్రబాబు అని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. చేతగాని వాడు చంద్రబాబు అయితే.. ఆయన కొడుకు ఒక శుద్ధపప్పు అని మండిపడ్డారు. ఒంగోలులో వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు చేతకానివాడు, ఆయన కొడుకు శుద్ధపప్పు అని, రాజధాని పేరుతో ప్రజలను మభ్యపెట్టేందుకు డ్రామాలు ఆడుతున్నాడన్నారు. దున్నపోతు ప్రభుత్వమని లోకేష్‌ ఆరోపిస్తున్నాడని, లోకేష్‌ను మించిన దున్నపోతు ఎవరూ ఉండరని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులను హెచ్చరించారు. మూడు రాజధానులు, అన్ని ప్రాంతాల అభివృద్ధే ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణకు మద్దతు పలుకుతుంటే చంద్రబాబు మాత్రమే వ్యతిరేకిస్తున్నాడన్నారు. అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలని మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చారన్నారు. సీఎం ప్రతిపాదనకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ర్యాలీలు చేపడుతున్నారని చెప్పారు. 
 

Back to Top