వైయస్‌ జగన్‌తోనే హరితాంధ్రప్రదేశ్‌ సాధన

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
 

గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కలలు కన్న హరితాంధ్రప్రదేశ్‌ సాధన మన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో సాధ్యమవుతుందని అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  ఏలిన వారు మంచి వారు అయితే వర్షాలు పడుతాయంటారన్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయన్నారు. నాగార్జునసాగర్‌ నిండిందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌ చేయాలని కలలు కన్నారని, మన సీఎం వైయస్‌ జగన్‌ హయాంలో హరితాంధ్ర సాధన సాధ్యమవుతుందన్నారు. ఎర్రచందనం మన రాష్ట్రంలోని కడప, చిత్తూరు, నెల్లూరు జి ల్లాల్లో ఉండేదన్నారు. ఎర్రచందనాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎర్రచందనాన్ని అమ్మేందుకు కేంద్రం కూడా సానకూలంగా స్పందించినట్లు చెప్పారు.మన రాష్ట్రానికి రావాల్సిన కంపా నిధులు కూడా కేంద్రం నుంచి వచ్చాయన్నారు. 
 

Back to Top