గౌత‌మ్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిది

మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి
 

ప్ర‌కాశం:  మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి అకాల మ‌ర‌ణం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీర‌ని లోట‌ని మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి  వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వాసన్నా అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించే గౌతమ్ లాంటి మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధ కలిగిస్తోంది. పార్టీకి ఆయన లేని లోటు పూడ్చలేనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top