నిన్నటి వరకూ డీజీపీని తిట్టిన నోటితోనే ఇప్పుడు రాద్ధాంతం  

మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి
 

ప్ర‌కాశం: నిన్నటి వరకూ డీజీపీని తిట్టిన నోటితోనే ఇప్పుడు.. ఆయన బదిలీపై చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి విమర్శించారు. డీజీపీ గౌతంస‌వాంగ్‌పై వ్యతిరేకత ఉంటే ఏపీపీఎస్సీ చైర్మన్ అవకాశం ఇవ్వబోమన్నారు. శ‌నివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో.. సీబీఐ తన పని తాను చేసుకుంటూ పోతోందని మంత్రి పేర్కొన్నారు. టీడీపీ హయాంలో జరిగిన హత్యతో.. ఎవరికి సంబంధం ఉంటుందో అర్ధం చేసుకోవాలన్నారు. హత్య జరిగినప్పుడే అప్పటి సీఎం చంద్రబాబు సీబీఐ ఎంక్వైరీ వేసి ఉండాల్సిందన్నారు. హత్యతో టీడీపీ వారికి సంబంధం ఉంటుందని భయపడే.. చంద్రబాబు సీబీఐతో దర్యాప్తు చేయించలేదని అన్నారు.  

తాజా వీడియోలు

Back to Top