టెరాసాప్ట్ అధినేత చంద్ర‌బాబుకు సన్నిహితుడు

మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి
 

అమ‌రావ‌తి:  టెరాసాఫ్ట్‌ కంపెనీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడని, టెండర్లలో టెరాసాఫ్ట్‌ కంపెనీ తక్కువ కోడ్‌ చేసినప్పటికీ వారికే టెండర్‌ దక్కిందని మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి పేర్కొన్నారు. వేమూరి హ‌రికృష్ణ కంపెనీలోని ప్ర‌తినిధులంతా చంద్ర‌బాబు స‌న్నిహితులేన‌ని తెలిపారు. మ‌రో వ్య‌క్తి నాగేశ్వ‌ర‌రావు చంద్ర‌బాబు సొంతూరి వ్య‌క్తి అన్నారు. రూ.307 కోట్ల‌కే లోయేస్ట్ టెండ‌ర్ న‌మోదు అయ్యింద‌న్నారు. చంద్ర‌బాబు క‌నుస‌న్నాల్లోనే టెండ‌ర్లు జ‌రిగాయ‌న్నారు.  ఫైబ‌ర్ గ్రిడ్ టెండ‌ర్ల‌లో 5 కంపెనీలు పాల్గొన్నాయని, టెండర్లు వేయడానికి ఒక రోజు ముందు టెరాసాఫ్ట్‌ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌ నుంచి తొలగించారని మంత్రి బాలినేని శ్రీనివాస్‌ ఆరోపించారు. ఈ కేసును సీఐడీకి అప్ప‌గించామ‌ని, ద‌ర్యాప్తు వేగ‌వంతంగా చేప‌ట్టి దోషుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top