కుప్పంలోనూ టీడీపీ ఓట‌మి ఖాయం

 విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి 

నెల్లూరు: కుప్పం మున్సిపాలిటీలోనూ తెలుగుదేశం పార్టీ ఓట‌మి ఖాయ‌మ‌ని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. నెల్లూరు కార్పొరేష‌న్‌లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో మంత్రులు అనిల్‌కుమార్ యాద‌వ్‌,  బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డిలు ఇంటింటి ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కుప్పంలో కూడా టీడీపీకి ఓటమి భయంపట్టుకుందని, గెలుపు కోసం లోకేష్ ఓటుకు రూ.5వేలు పంచటం సిగ్గుచేటని ధ్వ‌జ‌మెత్తారు. సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని చంద్ర‌బాబు.. రాష్ట్రానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. కుప్పంని మున్సిపాలిటీ చేసిన ఘనత ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. ప్ర‌తిప‌క్షం ఎన్ని కుట్ర‌లు చేసినా కుప్పంలో వైయ‌స్ఆర్ సీపీ జెండా ఎగురుతుంద‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతుందని, నెల్లూరు కార్పొరేషన్‌లో వైయ‌స్ఆర్ సీపీ విజయం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. 

Back to Top