బాబు కష్టకాలంలో దాక్కుని  ఇప్పుడు దొంగ దీక్షలు

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

విజయవాడ: కరోనాతో జనం ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ఎక్కడ దాక్కున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. కష్టకాలంలోదాక్కుని ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను పక్కదారి పట్టించడానికే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించినప్పుడే ప్రతిపక్ష పోయిందన్నారు. టీడీపీని బీజేపీలో విలీనం చేయడం మంచిదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top