బాబు నాయకత్వంపై టీడీపీ కేడర్‌కే నమ్మకం లేదు

పరిషత్‌ అయినా, తిరుపతి ఉప ఎన్నిక అయినా వైయస్‌ఆర్‌ సీపీదే గెలుపు

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖపట్నం: చంద్రబాబు నాయకత్వంపై ఆ పార్టీ కేడర్‌లో నమ్మకం పోయిందని, బాబు అవకాశవాది అని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు కూడా తెలిసే.. ఒక్కొక్కరుగా ఆ పార్టీ నుంచి జారుకుంటున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. విశాఖపట్నంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైయస్‌ జగన్‌ లాగా ప్రజాబలంతో వచ్చిన వ్యక్తి చంద్రబాబు కాదని, ఆయనదంతా కుట్రలు, కుయుక్తులు, మైండ్‌ గేమ్స్‌ రాజకీయాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చంద్రబాబు చెబుతుంటే.. టీడీపీ జిల్లా నాయకులు మాత్రం.. పోటీ చేస్తున్నామని చెబుతున్నారన్నారు. చంద్రబాబు చేసే జిమ్మిక్కు రాజకీయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీడీపీ ఎన్నికలు బహిష్కరించినా.. పోటీ చేసినా ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీ పక్షాన ఉన్నారని, సీఎంపై నమ్మకం, విశ్వాసంతో ఉన్నారన్నారు. పరిషత్‌ ఎన్నికలు అయినా, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక అయినా వైయస్‌ఆర్‌ సీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top