స్క్రిప్టు చదవడం తప్ప వాస్తవాలు తెలుసుకోవా..?

టూరిస్టులా వచ్చివెళ్లే పవన్‌కు రాష్ట్రం గురించి ఏం తెలుసు..?

టీడీపీ హయాంలో అవినీతి, గూండాగిరి పవన్‌కు కనిపించడం లేదా..?

టీడీపీతో ఎందుకు పొత్తుపెట్టుకున్నావ్‌..? ఎందుకు విడిపోయావ్‌..?

పవన్‌ కల్యాణ్‌పై మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపాటు

అమరావతి: పవన్‌కు ఆలోచన తక్కువ.. ఆవేశం ఎక్కువ అని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదవడం తప్ప వాస్తవాలు తెలుసుకోవా..? అని పవన్‌ కల్యాణ్‌ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. రాష్ట్రానికి టూరిస్టులా వచ్చివెళ్లే పవన్‌కు.. 13 జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి ఎలా తెస్తుందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడారు. పవన్‌ తప్పుడు మార్గంలో నడుస్తున్నాడని, చంద్రబాబు ఎంత మోసకారి, ఎంత వెన్నుపోటుదారుడు అని ఆరేళ్ల పిల్లాడి నుంచి 60 ఏళ్ల ముసలి వరకు ఎవరిని అడిగినా చెబుతారన్నారు. 

ఎన్టీఆర్‌ లాంటి మహానుభావుడికే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి పవన్‌ కల్యాణ్‌ ఎంత..? అని ఆలోచించుకోవాలన్నారు. ఎమర్జెనీ టైమ్‌లో వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఎలా కాపాడారో.. అలా కాపాడాలని పవన్‌ చెబుతున్నాడని, రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయా..? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో రోడ్లు, ప్రమాదాలు, అవినీతి, గూండాగిరి పవన్‌కు కనిపించడం లేదా..? అని నిలదీశారు. టీడీపీతో ఎందుకు పొత్తుపెట్టుకున్నావ్‌..? ఎందుకు విడిపోయావ్‌..? బీజేపీతో పొత్తు వల్ల రాష్ట్రానికి ఏం సాధించగలిగావో ప్రజలకు చెప్పాలి. అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం తప్పా..? అని ప్రశ్నించారు. పవన్‌ కేవలం సినిమాల్లోనే హీరో.. పొలిటికల్‌గా తాను హీరోనని మంత్రి అవంతి చెప్పారు. కుల, మతాలను చూడకుండా రూ.1.30 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో  సీఎం వైయస్‌ జగన్‌ నేరుగా జమ చేశారని గుర్తుచేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top