కుల, మత, వర్గ, లింగ బేధాలకు అతీతంగా జరుపుకునే పండుగ రాఖీ

మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌కు రాఖీ క‌ట్టిన ప్ర‌జాప‌తి బ్ర‌హ్మ‌కుమారీస్‌

విశాఖ‌:  రక్షాబంధన్ పండుగ కుల, మత, వర్గ, లింగ బేధాలకు అతీతంగా జరుపుకునే పవిత్రమైన పండుగ అని మంత్రి అవంతి శ్రీ‌నివాస్ అన్నారు. తోబుట్టువులందరూ ఎంతో ఆనందం, సంతోషాలతో జరుపుకునే పవిత్రమైన పండుగ అని తెలిపారు. శ్రావణ పౌర్ణమి సంధర్భంగా భారతీయులంతా ఎంతో ఆనందంతో జరుపుకునేదే రాఖీ పండుగ అని చెప్పారు. రక్షా బంధన్ పర్వదినం సంధర్భంగా సీతమ్మధారలోని ప్రజాపిత బ్రహ్మ కుమారీస్ ఈశ్వ‌రీయ‌ విశ్వవిద్యాలయానికి చెందిన బ్రహ్మకుమారీలు మంత్రికి రాఖీ క‌ట్టారు. ఈ సందర్బంగా బ్రహ్మకుమారీస్ కు మంత్రి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ.. మన భారతాన్ని స్వర్గ సీమగా, సువర్ణ భారతంగా మార్చేందుకు స్వచ్ఛమైన మనసుతో ప్రతిఒక్కరూ కట్టేదే ఈ రాఖీ పండుగ. సోదరి ద్వారా మనసా, వాచా, కర్మణా, పవిత్రంగా, సత్సంగ జీవితాన్ని తయారు చేసుకోవడమే ఈ పండుగ ప్రత్యేకత' అని  అవంతి శ్రీనివాసరావు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top