జాతి సంపదను ప్రైవేట్‌ వ్యక్తులకు ఇవ్వడం సరికాదు

మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖ:  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ జాతి సంపద అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. జాతి సంపదను ప్రైవేట్‌ వ్యక్తులకు ఇవ్వడం సరికాదని తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద జరిగే ఆందోళనలో తెలుగువారంతా పాల్గొని నిరసన తెలపాలన్నారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పనులు ఉండరాదని చెప్పారు. మన అభిప్రాయభేదాలను , స్థానికంగా ఉన్న రాజకీయ విభేదాలను పక్కనపెట్టి అందరూ ప్లాంట్‌ కోసం పోరాడాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లాంట్‌ పరిరక్షణకు ముందుంటుందని చెప్పారు. కార్మిక సంఘాలు జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా 125 రోజులుగా పోరాటం చేయడం మంచి పరిణామమని, ఇలాగే ఐక్యంగా ఉద్యమించాలన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top